అలంపూర్ : జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంను బుధవారం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, దేవా దాయ-ధర్మాదాయ శాఖ సహాయ కమీషనర్ జి. శ్రీని వాస రాజు, ఆలయ కార్యనిర్వాహణాధికారి పురెందర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతన ధర్మకర్తల మండలి సభ్యులుగా 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో చిన్న కృష్ణయ్య, చంద్ర కళ, వెంకటనారాయణ రెడ్డి, రఘు, ధనుంజయ, బీ. సత్యన్న, వెంకటేశ్వర రెడ్డి, చాకలి వెంకటేశ్వర్లు, బి. అంపయ్య, గొల్ల కేశన్న, అడివప్ప, కే. సత్యనా రాయణ, కే. రమేష్ బాబు, యం. సురేఖ సభ్యు లుగా, ఆలయ ముఖ్య అర్చకులు ఎక్స్ అఫిషియో సభ్యులు డీ. ఆనంద్ శర్మ, ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ్యులు సి. చంద్రకళ, కే. వెంకటేశ్వర రెడ్డి, చైర్మన్‌గా బీ.చిన్న కృష్ణయ్య పేరును ప్రతిపాదించగా సభ్యులందరూ దీనికి ఆమోదం తెలిపారు.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథు లుగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి, బీఆర్‌ఎస్ ఢిల్లీలో తెలం గాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి మంధా జగ న్నాధం, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య, మునిసిపల్ చైర్‌పర్సన్ మనోరమ వెంకటేష్ , వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, ఎంపీపీ బేగం గోకారి, జెడ్పీటీసీ శంషాధ్ ఇస్మాయిల్, ఆలయ మాజీ చైర్మన్లు, ధర్మకర్తలు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.