గురుకుల ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి : జూలకంటి రంగారెడ్డి

  • సీఎంకు లేఖ

    గురుకుల ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రికి జూలకంటి లేఖ
    గురుకుల ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రికి జూలకంటి లేఖ

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో గురుకుల ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీపీఐ(ఎం) మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి లేఖ రాశారు. అందులో  కేజీ టు పీజీ విద్య పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాపితంగా 700లకు పైగా, మొత్తం రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలతో సహా 1002 గురుకుల విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి. ఒక్కో సొసైటీలో ఒక్కో రకంగా పరిపాలన, అజమాయిషీ కొనసాగుతున్నది. బోధనా సమయాల్లో సైతం ఏకరూపత లేదు. కొత్త విద్యా సంస్థలన్నీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. రెగ్యులర్‌ టీచర్స్‌తో పాటు, సమాన సంఖ్యలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, గెస్ట్‌, పార్ట్‌టైం టీచర్స్‌ పనిచేస్తున్నారు. వారికి కనీస వేతనాలు లేవు. 2018, 2019 సంవత్సరాల్లో నియామకమైన రెగ్యులర్‌ టీచర్ల సర్వీస్‌ను రెగ్యులరైజేషన్‌ పూర్తిచేయడంలో, ప్రమోషన్స్‌ ఇవ్వడంలో ఒక్కో సొసైటీ ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నది. ఈ సంస్థలన్నీ నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. విద్యార్థులు కూడా మంచి విజయాలు సాధిస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠ్యబోధనే కాకుండా హౌజ్‌ మాస్టర్‌, కేర్‌టేకర్‌, డిప్యూటీ వార్డెన్‌, సూజర్‌వైజరీ స్టడీస్‌, నైట్‌ స్టే, ఎక్కార్ట్‌ డ్యూటీలు సెలవులు లేకుండా చేస్తూ శారీరక శ్రమతో పాటు, తీవ్ర మానసిక ఒత్తిడీకి లోనవుతున్నారు. నిర్వహణలో ఏమాత్రం తేడా వచ్చినా పరిష్మెట్‌లు తీవ్రంగా ఉంటున్నాయి. అయినా వీరికి శ్రమకు తగిన వేతనం, గుర్తింపు లేకపోవడం దారుణం. వీరి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అనేక రకాలుగా నిరసనలు తెలియజేసారు. అయినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆగస్ట్‌ 5న హైదరాబాదులో జరిగిన మహాధర్నాకు నేను హాజరై వారి సమస్యలను తెలుకున్నానని వివరించారు. ఆ సమస్యలన్నీ న్యాయమైనవే. కాబట్టి తక్షణమే తమరు జోక్యం చేసుకోని ఈ క్రింద పేర్కొన్న వారి న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

డిమాండ్స్ :

1. అన్ని సొసైటీల్లో ఏకరూప పరిపాలన అమలు చేయాలి.
2.TSREIS, MJPTBCWREIS విద్యాసంస్థల్లో బోధనా సమయాన్ని ఇతర సొసైటీల్లో మాదిరిగా ఉదయం 9.00 నుండి సాయంత్రం 4.30 వరకు ఉండే విధంగా మార్చాలి.
3. పిఓ – 2018కి అనుగుణంగా చేసిన రీ అలైన్మెంట్‌ పై ఉపాధ్యాయుల గ్రీవెన్సెస్‌ అన్నింటినీ సానుకూలంగా పరిష్కరించాలి. కోర్టు వివాదాలను సత్వరమే పరిష్కరించాలి.
4. అన్ని గురుకులాల్లో బదిలీలు, పదోన్నతుల కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ వెంటనే విడుదల చేయాలి.
5. అన్ని సొసైటీల్లో ప్రిన్సిపాల్‌ 100%, జెఎల్‌, పిజిటి పోస్టుల్లో 70% ఇన్‌ సర్వీసు పదోన్నతుల కోటాగా నిర్ణయించాలి.
6. అన్ని సొసైటీల్లో నెల మొదటి తేదినే వేతనాలు ఇవ్వాలి.
7. శ్రమకు తగిన వేతనం ప్రాతిపదికన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకంటే అదనంగా వేతనాలు (పారిటీ స్కేల్స్‌) అమలు చేయాలి.
8. గురుకుల ఉపాధ్యాయులపై పనిభారం, మానసిక వత్తిడి తగ్గించాలి.
9. ఇతర ఉపాధ్యాయులతో సమానంగా హెల్త్‌ కార్డులపై నగదు రహిత వైద్యం, మెడికల్‌ రీయింబర్స్‌ మెంట్‌ సౌకర్యం కల్పించాలి.
10. కేర్‌ టేకర్‌, డిప్యూటీ వార్డెన్లను ప్రత్యేకంగా నియమించి ఉపాధ్యాయులను నైట్‌ డ్యూటీల నుండి మినహాయించాలి.
11. ఆదివారం, పండుగ సెలవుల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు వీక్‌ ఆఫ్‌ వర్తింపజేయాలి.
12. సొసైటీ మారిన, ప్రభుత్వ సర్వీస్‌ నుండి సొసైటీకి వచ్చిన ఉపాధ్యాయులకు పే ప్రొటెక్షన్‌ వర్తింపజేయాలి.
13. కాంట్రాక్టు, గెస్ట్‌, పార్ట్‌ టైం, ఔట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులకు బేసిక్‌ పే మరియు 12 నెలల వేతనం ఇవ్వాలి.
14. సిఆర్టీల సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలి.
15. 2007 లో రెగ్యులరైజ్‌ అయిన ఉపాధ్యాయులకు నోషనల్‌ సర్వీసు, పాత పెన్షన్‌ విధానం వర్తింజేయాలి.
16. గెస్ట్‌, పార్ట్‌ టైం, ఔట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులకు గురుకుల ఉపాధ్యాయుల నియామకాల్లో వెయిటేజి ఇవ్వాలి.
17. బాలురు, బాలికల పాఠశాలల్లోని మహిళా ఉపాధ్యాయులకు కంబైన్డ్‌ సీనియారిటీ వర్తింపజేయాలి.
18. ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ టీచర్లకు, స్టాఫ్‌ నర్స్‌ లకు ప్రమోషన్‌ చానల్‌ కల్పించాలి.
19. సోషల్‌ వెల్ఫేర్‌ సొసైటీలో న్యూ పెర్ఫార్మెన్స్‌ అప్రైజల్‌ పాలసీ NPAP ఆధారంగా రూల్‌ 28 అమలును నిలిపివేయాలి.
20. మైనారిటీ రెసిడెన్షియల్‌ టీచర్లకు ఇ కుబీర్‌ లో పెండిరగ్‌ లో ఉన్న పిఆర్సీ బకాయిలు చెల్లించాలి.
21. ప్రతి పాఠశాలకు అదనంగా ఒక ఏఎన్‌ఎం ఇవ్వాలి. క్వాలిఫైడ్‌ డాక్టర్స్‌ కు డిగ్రీ కాలేజీలకు ప్రమోషన్‌ ఇవ్వాలి.
22. 2018, 2019 లో నియామకం అయిన ఉపాధ్యాయులకు పెండిరగ్‌ లో ఉన్న సర్వీసు రెగ్యులరైజేషన్స్‌, ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి.
23. అన్ని రెసిడెన్షియల్‌ పాఠశాలల ప్రిన్సిపాల్‌ పోస్టును గ్రేడ్‌ 1 గా అప్గ్రేడ్‌ చేయాలి.
24. విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంపు ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి.
25. అన్ని గురుకుల విద్యాలయాలకు శాశ్వత భవనాలు, స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మించాలి.
26. సోషల్‌ వెల్ఫేర్‌ సొసైటీలో స్టాఫ్‌ క్వార్టర్స్‌ కు ట్రైబల్‌ వెల్ఫేర్‌ సొసైటీ మాదిరిగా నిర్దిష్ట అద్దెను నిర్ణయించాలి.

Spread the love