ఐపీఎల్‌కు కార్తీక్‌ వీడ్కోలు

నవతెలంగాణ – హైదరాబాద్: వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. తన జట్టు బెంగళూరు బుధవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆ మ్యాచ్‌ అయిన వెంటనే కార్తీక్‌ ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు. అతను ఐపీఎల్‌లో బెంగళూరుతో పాటు కోల్‌కతా, ముంబయి ఇండియన్స్, గుజరాత్‌ లయన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్లో కార్తీక్‌ 15 మ్యాచ్‌లాడి 36.22 సగటుతో 326 పరుగులు చేశాడు.

Spread the love