నవతెలంగాణ – ధర్మసాగర్
తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి త్రాగునీరును అందించిన అపార భగీరధుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వారోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలోని రిజర్వాయర్ వద్ద గల మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ వారి సారధ్యంలో నిర్వహించిన మంచి నీళ్ల పండుగ దినోత్సవం కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ , వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ గార్లతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ఉధ్యేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చడానికి సీఎం కేసీఆర్ 43000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 66 పట్టణాలకు , 24 వేల గ్రామాలకు , ఆవాసాలకు 2 లక్షల కిలోమీటర్ల మేర పైపులైన్ ద్వారా స్వచ్ఛమైన సురక్షితమైన శుద్ధిచేసిన తాగునీరును సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ ఒక్కో ఇంటికి 100 లీటర్ల చొప్పున మొత్తం 54 లక్షల ఇళ్లకు సురక్షితమైన తాగునీరును మిషన్ భగీరథ ద్వారా అందించడం జరుగుతుందన్నారు.కృష్ణ , గోదావరి నదులతో సహా 19 ప్రధాన జలాశయాల నుంచి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 50 వాటర్ ట్రీట్మెంట్ ప్లాట్ లకు నీటిని పంపిణీ చేసి రోజుకు నాలుగు దశల్లో సుమారు 4000 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి 255 పంప్ హౌస్ ల నుంచి 35422 ఓవర్ హెడ్ ట్యాంక్ ల ద్వారా ఇంటింటికి నీటిని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పెదనానంతరం ఎంపీ దయాకర్ మాట్లాడుతూ 2018 ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన శుద్ధిచేసిన తాగునీటిని అందించకపోతే రానున్న ఎన్నికల్లో నేను ఓటు అడగనని చెప్పి 2018 ఎన్నికలకు ముందే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించిన మహానుభావుడు సీఎం కేసీఆర్ గారు అని తెలిపారు.మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి మారుమూల పల్లెకు ప్రతి ఇంటికి నల్లాల ద్వారా శుద్ధిచేసిన స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు.రాబోయే తరాల త్రాగునీటి అవసరాలను కూడా తీర్చే భారీ మౌలికసదుపాయాలు , అత్యాధునిక నీటి సరఫరా వ్యవస్థతో మారుమూల ప్రాంతాలకు సైతం సురక్షితమైన శుద్ధిచేసిన మంచినీటిని మిషన్ భగీరథ అందిస్తుందని తెలిపారు.ఈ పథకానికి పలు కేంద్ర అవార్డులతో పాటు జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు రావడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ ఎం సుధీర్ కుమార్,స్టేషన్గన్పూర్ నియోజకవర్గం మరియు వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన ఎంపీపీలు జడ్పిటిసిలు సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ముఖ్య నాయకులు మహిళలు ప్రజలు మరియు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.