యూనివర్సిటీకి ఒక బాలికల వసతి గృహ మంజూరు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగిన సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీ కీ ఒక బాలికల వసతి గృహం మంజూరైనట్లు తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారని, తెలంగాణ‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి ఆదివారం తెలిపారు. ఈ వసతి గృహం గిరిజన పేద విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి వివారించారు. వసతి గృహాల నిర్మాణానికి సంబంధించిన తెలంగాణ యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ, కమిషనర్, గిరిజన సంక్షేమ శాఖ దికరిణి ఐఏఎస్ క్రిస్టియన్ జెడ్ చోంగ్తు, ఏఈ వినోద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఒప్పంద పత్రాలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి స్వీకరించారు.

Spread the love