తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ గుర్తించాలి

– దశాబ్ది ఉత్సవంలో ఉద్యమకారులను మరచిన ముఖ్యమంత్రి కేసీఆర్
– తెలంగాణ ఉద్యమకారుడు గిరిధర్ యాదవ్ ఆవేదన
నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్పకుండా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ ఉద్యమకారుడు యాదవ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదివారం ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. జూన్ 1వ తేదీ నుండి తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరిచిపోయాడు. ఇప్పటివరకు గుర్తించలేకపోయాడు అని తాము బాధపడుతున్నామన్నారు. నిజామాబాద్ జిల్లా నుండి తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు వారిని కూడా ఇప్పటివరకు గుర్తించకపోవడం అమరవీరులైన తెలంగాణ పౌరులకు జోహార్లు అని చెబుతూనే తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వారిని మర్చిపోవడం ఎంతవరకు సమంజసం అని తెలంగాణ ఉద్యమకారుడు గిరిధర్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో లేని వారిని నామినేటెడ్ పోస్టులను అలాగే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలుగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి వత్తాసు పలుకుతున్నాడని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారిని తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎందుకు మర్చిపోయాడు అని నిలదీశాడు. తెలంగాణ ఉద్యమంలో మొదట తెలంగాణ జెండాను తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినటువంటి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏఎస్ పోశెట్టి బాబు రెడ్డి సైకిల్ నరసయ్య గిరిధర్ యాదవ్ తో పాటు తదితరుల తో పాటు తెలంగాణ జెండాను డాక్టర్ బాబు రెడ్డిపై ఎగరవేయడం జరిగిందని ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మర్చిపోయారని ఈ సందర్భంగా మేము అనగా ఉద్యమకారులముగా గుర్తు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో తమపై ఎన్నో కేసులు నమోదు చేసిన ఎన్నో పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగిన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేయాలని గిరిధర్ యాదవ్ కోరుతున్నాను అన్నారు. గత ఒక్కరోజు క్రితం హైదరాబాదులోని సోమాజిగూడలో తెలంగాణ ఉద్యమకారులు భేటీ అయ్యారని ఆ భేటీ విషయంలో చర్చ జరుగుతుందని ఆ చర్చ విషయంలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్యమకారులను గుర్తించాలని కోరుతున్నామన్నారు.

Spread the love