సంగారెడ్డి పేలుడు ఘటనపై కేసీఆర్ దిగ్ర్భాంతి..

నవతెలంగాణ – హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో ఎస్బీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

Spread the love