నవతెలంగాణ-జవహర్‌నగర్
కార్పొరేషన్‌లోని ఏండ్ల నాటి కష్టాలు శాశ్వతంగా తీరనున్నడంతో ప్రగతి పనులకు కేరాఫ్‌గా జవహర్‌నగర్ మారుతుందని మేయర్ మేకల కావ్య అన్నారు. గురువారం కార్పొరేషన్‌లోని 15వ డివిజన్లో రూ.10 లక్షలతో డ్రయినేజీ పనులు, 8వ డివిజన్ సంతోశ్‌నగర్‌లో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో డ్రయినేజీ పనులు, 26వ డివిజన్ కార్పొరేటర్ పానుగంటి బాబు ఆధ్వర్యంలో సీసీ రోడ్డు రూ. 90 లక్షలతో ప్రగతి పనులను ప్రారంభించా రు. ఈ సంద ర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్లో రూ.కోటితో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మట్టి రోడ్లు, సీసీ రోడ్లుగా మారు తున్నాయన్నారు. మురుగు నీరు రోడ్లపై కనిపించద న్నారు. మంత్రి మల్లారెడ్డి ఎల్లప్పుడు జవహర్ నగర్ నా గుండెకాయ అంటూనే గుండేకాయకు భారీ ఎత్తున నిధులు కేటాయించి పేద ప్రజల కష్టాలు తీర్చుతున్నారని పేర్కొన్నారు. అంతరించిపోతున్న కుల వృత్తులకు సీఎం కేసీఆర్ జీవం పోస్తూ రూ.లక్ష అందజేస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో నాయకులు మహేష్, నాగభూషణం, శ్రీనాథ్, శ్రీమన్, కృష్ణరెడ్డి, సుధాకర్ గౌడ్, మల్లారెడ్డి, రజిత, కాలనీవాసులు పాల్గొన్నారు.