కిసాన్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం

నవతెలంగాణ – కంటేశ్వర్
కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లా కిసాన్ కాంగ్రెస్ కమిటీ నీ ,మండల అధ్యక్షులను ప్రకటిస్తూ ఆర్డర్ కాఫీలు మంగళవారం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి,పిసిసి ఉపాధ్యక్షులు తాహేర్ బిన్ హాందన్,జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఇంఛార్జి అది రెడ్డి పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ జిల్లాకు సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలం, జిల్లా మంత్రికి ఎమ్మెల్యేలను సూటిగా అడగుతున్నాం.9 యేండ్లు గడుస్తున్నా చుక్క నీరు సాగుకు ఇవ్వలేదు. 21 ప్యాకేజి తో గ్రావిటీ ద్వారా సాగు నీరు అందించే అవకాశం ఉన్న కమీషన్ల కోసం పైపు లైన్ గా మరిచి పైపులు వేసి పైసలు దొబ్బి చుక్క సాగు నీరు ఇవ్వలేరు. గతంలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి హయాంలోనే గుత్ప, అలిసాగర్ తో అనేక లిఫ్ట్ ఇర్రిగేషన్ ల ద్వారా సాగు నీరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ జిల్లాలో తరుగు పేరు మీద దోపిడీ జరిగితే ఎందుకు జిల్లా మంత్రి ఎమ్మెల్యేలు మౌనంగా వున్నారు. మీకు వాటాలు ఉన్నాయా లేకుంటే ఎందుకు తరుగు దోపిడీని అడ్డుకోలేదు. పంట నష్టం ఎందుకు ఇవ్వలేకపోయారుమీరు మాఫీ చేస్తా అన్న రుణమాఫీ చేయకపోవడం వలన అదనపు వడ్డీ భారం రైతుల మీద పడుతుంటే మీరు ఏమి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు తాహేర్ బిన్ హాందన్ మాట్లాడుతూ దేశానికి వెన్నెముక రైతు కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రైతు జీవితాన్ని దుర్భర పరిస్థితిలోకి నెట్టుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని చేయకపోవడం ద్వారా బ్యాంకులలో తీసుకున్న రుణానికి వడ్డీ పెరిగి రైతులు కట్టలేని స్థితికి వెళ్లారని, అదేవిధంగా ఎరువుల ధరలను విపరీతంగా పెంచేసిందని, వ్యవసాయ పనిముట్ల పైన సబ్సిడీలు ఎత్తివేసిందని, పెట్టుబడి సాయం అందించడం లేదని, అకాల వర్షాలతో రైతులు నష్టపోతే నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ,రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటిస్తామని, కాంగ్రెస్ పార్టీ చెప్పింది అంటే చేసి తీరుతుంది అనే దానికి నిదర్శనంగా ఈరోజు చత్తిస్గడ్ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని 2500 మద్దతు ధరతో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అదేవిధంగా మహిళలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా అధికారంలోకి రాగానే 5 హామీలను నెరవేర్చిందని అందులో భాగంగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిందని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కిసాన్ కాంగ్రెస్ పాత్ర కీలకమని,గ్రామ గ్రామాన కిసాన్ కాంగ్రెస్ నాయకులు ప్రజల వద్దకు వెళ్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చేసిన మోసాలను వివరించాలని,రాష్ట్ర ప్రభుత్వం రైతుకు రుణమాఫీ చేస్తామని,పంట నష్టపరిహారం ఇస్తామని మోసం చేసిందని,రైతు బంధు ఇస్తూనే వ్యవసాయ మందులపై సబ్సిడీని ఎత్తివేసింది,జిల్లాలో రైతులకు సాగు నీరు అందిచండంలో జిల్లా మంత్రి ఎమ్మెల్యేలు విఫలం అయ్యారని,కావున కిసాన్ కాంగ్రెస్ నాయకులు గ్రామ గ్రామాన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసాలను వివరించి,రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేసే పనులు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ కానీ,భూమిలేని ఉపాధి హామీ కూలీలకు 12000 రూపాయలు కానీ ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో నందిపెట్ రాజేందర్, దొంకేశ్వర్ చిన్న రెడ్డి,మక్లుర్ అలిముద్దిన్, ముపకల్ సాగర్, భీంగాల్ చిన్న రెడ్డి, మెందొర మురళి, డిచ్పల్లీ సాయిరెడ్డి, దర్పల్లీ నర్సారెడ్డి, మోపల్ ముత్యం రెడ్డి, బోధన్ పోషెట్టీ, కోటరిగి ఆనంద్, రుద్రుర్ సాయిలు, వర్ని కిషన్, చందూర్ మల్లయ్య, మొస్ర రాజు, పోతంగాల్ శ్రీకాంత్ లకు మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది.

Spread the love