బీఆర్ఎస్ లోకి కోనేరు చిన్ని!

గూలాబీ గూటికి కోనేరు
గూలాబీ గూటికి కోనేరు

–  పొంగులేటి టార్గెట్ గా కేసీఆర్ వ్యూహాలు
నవతెలంగాణ – ఖమ్మం:
మాజీమంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు చిన్ని అలియాస్ సత్యనారాయణ బీజేపీని వీడను‌న్నారు. ఆయన్ను బీఆర్ ఎస్ లో చేర్చుకునేందుకు కేసీఆర్ మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగానే బలమైన సామాజిక వర్గానికి చెందిన చిన్నిని తమ వైపు తిప్పకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం  బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చిన్నిని ఎంపీ నామ నాగేశ్వరరావు ద్వారా బీఆర్ఎస్ లో చేర్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ మేరకు సోమవారం నుంచే హైదరాబాదులో కేసీఆర్ తో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. తన తండ్రి కాలం నుంచి ప్రస్తుత టీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు కోనేరు వర్గీయులకు పొసగదు. చిన్ని భవిష్యత్తుకు పూర్తి భరోసానిచ్చి  కేసీఆర్  బీఆర్ఎస్ లో చేర్చుకోనున్నారని తెలుస్తోంది. వనమా సైతం చిన్ని చేరికను స్వాగతిస్తున్నట్లు సమాచారం.

Spread the love