– ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు : కోలేటి దామోదర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు జనం మెచ్చిన నాయకుడనీ, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా రాణించాలనీ, యువతకు ఐకాన్‌గా, పార్టీ నాయకులకు మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
కేటీఆర్ జన్మదినం : టెకీల రక్తదానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్ మెంట్ కౌన్సిల్ (టీఎఫ్‌ఎంసీ) అధ్యక్షులు ఎం.సత్యనారాయణ, ఐటీ డిప్యూటీ సీఆర్‌ఓ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ ఖాజాగూడలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ వెనుకవైపు ఉన్న దివ్యశ్రీ ఎన్‌ఎస్‌ఎల్ ఐటీ పార్క్ లో నిర్వహించే ఈ శిబిరంలో దాదాపు వెయ్యి మంది వరకు రక్తదానం చేస్తారని తెలిపారు.