కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎంపీటీలు, సర్పంచులు

– అమ్మవారి బంగ్లాలో గద్వాల జిల్లా బంధీ: రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
జోగులాంబ గద్వాల జడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత, తిరుపతయ్య, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో గద్వాల నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల నేతలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులతో కలిపి 800 మంది హస్తం పార్టీలో చేరారు. అందులో 30మంది సర్పంచులు, 12 మంది ఎంపీటీలతోపాటు పలువురు నాయకులు ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బంధీ అయిందని ఆరోపించారు. ప్రజలను ఆ బంగ్లా ముందు బానిసలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకముంటే, సిట్టింగులందరికీ సీట్లివ్వాలని సూచించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ పోటీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love