కార్మిక సంక్షేమంలో నిర్లక్ష్యం వహించకూడదు

– డైరక్టర్‌ (పా) అండ్‌ ఆపరేషన్స్‌ ఎన్‌వీకే.శ్రీనివాస్‌
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కార్మిక సంక్షేమం విషయంలో ఎటువంటి నిర్లక్షం వహించకూడదని, సింగరేణి వ్యాప్తముగా త్వరలో ఉద్యోగుల హాజరుని ఫేషియల్‌ రికగేషన్‌ అప్లికేషన్‌ ద్వారా నమోదు చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని, గనులు, డిపార్టుమెంట్‌లలో సమయపాలన పాటించేలా చర్యలను తీసుకోవాలని సింగరేణి డైరక్టర్‌ (పా) అండ్‌ ఆపరేషన్స్‌ ఎన్‌వీకే.శ్రీనివాస్‌ అన్నారు. శనివారం అన్ని ఏరియాల పర్సనల్‌ డిపార్ట్మెంట్‌ అధికారులతో కొత్తగూడెంలోని ఇల్లందు క్లబ్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ నియామకాలు, కారుణ్య నియమకాలు, ఆన్‌లైన్‌ ద్వారా సీఎంపీఎఫ్‌ క్లెయిమ్స్‌ను త్వరగతిన సెటిల్‌ చేసే విధానం, సీపీఆర్‌ఎంఎస్‌ మెడికల్‌ కార్డ్‌, కార్మికుల క్వార్టర్స్‌, ప్రమోషన్స్‌, కోర్ట్‌ కేసులు వంటి అంశాలపై అడిగి తెలుసుకున్నారు. కార్మికుల వెల్ఫేర్‌కి సంబంధించిన ఎటువంటి పైల్స్‌ పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం సుధీర్ఘముగా జనరల్‌ మేనేజర్‌గా పదవీ భాధ్యతలు నిర్వహించి, పదవీ విరమణ పొందుతున్న జీఎం(పర్సనల్‌) వెల్ఫేర్‌ అండ్‌ ఆర్‌సీ కే.బసవయ్యని అధికారులు సన్మానించారు. పర్సనల్‌ డిపార్ట్మెంట్‌కి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్లు కే.బసవయ్య, బీ.హనుమంతరావు, కవితా నాయుడు, పీ.సామ్యూల్‌ సుధాకర్‌, నికోలస్‌, కే.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love