కుంటలు, చెరువులను కాపాడుకోవాలి

– రామన్నపేట లోతుకుంటను సుందరీకరిస్తాం
– ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ -రామన్నపేట
కుంటలు, చెరువులు జల సిరులకు నిలయాలని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, నీటిపారుదల శాఖ అధికారులు లోతుకుంటలో సమగ్ర భూ సర్వే నిర్వహించి ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని లోతుకుంట (కుమ్మరి కుంట) ను ఇరిగేషన్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. అక్రమనకు గురైన భూమిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణానికి మధ్యలో భువనగిరి – చిట్యాల రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ లోతుకుంటను సుందరీకరిస్తామన్నారు. సుందరీకరణకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్దం చేయాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ బొడ్డు సురేందర్‌ రావు, స్థానిక ఎంపీటీసీ-1 గోరిగే నరసింహ, మండలం కో ఆప్షన్‌ సభ్యులు అమేర్‌, నాయకులు ముక్కాముల సత్తయ్య, దండుగుల సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
ధర్మారెడ్డిపల్లి కాలువ గండిని పరిశీలించిన
ఎమ్మెల్యే చిరుమర్తి
మండలంలోని సర్నేనిగూడెం గ్రామ శివారులో గత వర్షాకాలంలో ధర్మారెడ్డిపల్లి కాలువకు పడిన గండిపడిని, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం పరిశీలించారు. వర్షాకాలం వస్తుందందున తక్షణమే కాలువకు పడిన గండిని పూడ్చడానికి అధికారులు సిద్ధం కావాలనిఅవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలనిసంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐబీ ఈఈ సురేందర్‌ రావు, పీఏసీఎస్‌ చైర్మెన్‌ నంద్యాల బిక్షం రెడ్డి, సర్పంచులు ధర్నే రాణి, ఎడ్ల మహేందర్‌ రెడ్డి, ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, ఎడ్ల నరేందర్‌ రెడ్డి, సురేందర్‌ రెడ్డి, కర్రే రమేష్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love