ఉమ్మడి నల్లగొండ జిల్లా కెసిఆర్ ఖిల్లా..

నవతెలంగాణ-సూర్యాపేట
ఉమ్మడి నల్లగొండ జిల్లా లో బీఆర్ఎస్ పార్టీ బలానికి నిదర్శనం   రాబోయే శాసన సభ ఎన్నికల గాను ముఖ్యమంత్రి  చేసిన అభ్యర్థుల ప్రకటన అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి  అన్నారు.సోమవారం స్థానిక సుమంగళి పంక్షన్ హల్ లో జరిగిన పార్టీ కార్యక్రమం అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున సూర్యాపేట అభ్యర్థిగా మూడవసారి తనకు, ప్రస్తుత శాసనసభ్యులకు  అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి   కేసీఆర్ కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు . రాష్ట్ర మంత్రిగా అవకాశం పొందడానికి తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా కెసిఆర్ ఖిల్లా అని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ స్ఫూర్తిని కొనసాగిస్తూ 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగరేసి కెసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టు కుంటామని ఆయన తెలిపారు. సూర్యాపేట ప్రజలు ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని నందనవనంగా తీర్చిదిద్దడానికి కంకణ బద్ధుడనై పనిచేస్తానన్నారు. రాజకీయాల్లో టికెట్లు ఆశించడం తప్పు కాదని టికెట్ రానివారు నిరాశపడవద్దన్నారు. వచ్చిన వారు కూడా తమ సహచర నేతలను కలుపుకొని పనిచేసి పార్టీ , నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రైతాంగం  ప్రధానంగా ఉన్న నల్గొండ జిల్లాలో వ్యవసాయ అభివృద్ధి కోసం కేసీఆర్ తీసుకున్న  చర్యలు మిషన్ కాకతీయ నుండి మొదలై  నీటి పారుదల రంగం లో తీసుకున్న అనేక కార్యక్రమాలు, రైతు బంధు, రైతు బీమా,24 గంటల కరెంట్, కృష్ణ గోదావరి జలాల ను తెచ్చి నల్లగొండ జిల్లా ను ససశ్యామలం అయిందన్నారు. రైతాంగం విషయంలో రాష్ట్రంలోని అత్యధికంగా లాభ పడింది ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులే అన్నారు. రైతాంగం అంతా కేసీఆర్ పాలన పట్ల విశ్వాసంగా ఉన్నారని తెలిపారు.  మరోసారి 12 కు 12 స్థానాలను బిఆర్ఎస్ అభ్యర్థులు తిరిగి  గెలిచి కేసీఅర్ వద్దకు వెళతాం ఆన్నారు. ముఖ్యమంత్రి తన పై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్ ప్రకటన తో సూర్యాపేట లో సంబరాలు
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు, బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు,
మూడవసారి సూర్యపేట నుండి మంత్రి జగదీశ్ రెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించడంతో సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. తమకు అభివృద్ధిని పరిచయం చేసిన జగదీశ్ రెడ్డి మూడోసారి పోటీ చేస్తున్నారని విషయం తెలిసిన వెంటనే టిఆర్ఎస్ కార్యకర్తలు,మహిళాలు, నాయకులు సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుతూ, బాణా సంచా కాలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళ నాయకులు డాన్సులు చేస్తూ మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ తల్లి బొమ్మ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సూర్యాపేటలో శాంతి భద్రతలు నెలకొల్పి, సూర్యాపేట ను ప్రపంచ సాయి పట్టణంగా  తీర్చిదిద్దుతున్న జగదీష్ అన్నను మూడోసారి గెలిపించుకుంటామని వాగ్దానం చేశారు.
Spread the love