రేపు జరిగే గద్దర్, జహీర్ అలీ ఖాన్ ల సంస్మరణ సభను జయప్రదం చేయండి.

నవతెలంగాణ-సూర్యాపేట
ఈనెల 22వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగే ప్రజా గాయకులు గద్దర్, జహీర్ అలీ ఖాన్ ల సంస్మరణ సభను జయప్రదం చేయాలని గద్దర్,జహీర్ అలీ ఖాన్ స్మారక కమిటీ అధ్యక్షుడు నారబోయిన వెంకట్ యాదవ్ పిలుపునిచ్చారు.సోమవారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గద్దర్,జహీర్ అలీ ఖాన్ ల సంస్మరణ సభ పోస్టర్  ఆవిష్కరణ లో ఆయన మాట్లాడారు. గద్దర్, జహీర్ అలీ ఖాన్ ల స్మారక సభకు  ప్రజలు, ప్రజాసంఘాలు, పార్టీ లు, మేధావులు, విద్యార్థి సంఘాలు, కవులు, కళాకారులు అందరూ పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల, ప్రజాసంఘాల నాయకులు రేపాక లింగయ్య, మండారి డేవిడ్, చామకురీ నర్సయ్య, అబ్దుల్ కరీం, బుద్దా సత్యనారాయణ, ఆవుల నాగరాజు, నాగయ్య, భాను ప్రసాదు, మాండ్ర మల్లయ్య, మట్టపల్లి సైదులు, రమా శంకర్, పేర్ల నాగయ్య, దాసరి రాములు, అనంతుల మధు, కోట గోపి, వాసు, గోపీనాథ్, బందన్ నాయక్, వీర బాబు, పుల్లురు సింహాద్రి, భరత్, తది తరులు పాల్గొన్నారు.
Spread the love