ప్రజల పక్షాన ప్రశ్నిస్తా : మందకృష్ణ మాదిగ

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
ఇలానే ఉంటే భవిష్యత్తులో కాంగ్రెస్‌ అడ్రెస్‌ లేకుంటా పోతదనీ సోషలిస్ట్‌ పార్టీ వ్యవస్థాపకుడు ఎమ్మా ర్పీఎస్‌ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మార్పీఎస్‌ సంఘాల నాయ కులతో కలిసి ఆయన మాట్లాడారు. కులాలు తెగల పట్ల అభిమానం ఉండొచ్చు కానీ కులతత్వం ఉండొ ద్దని, కులతత్వ పోకడల వాళ్ళ తీసుకుంటున్న నిర్ణ యాలు ద్వారా అన్ని వర్గాలకి దూరం అవుతున్నా రని, అయినా ఆయన అదేపోకడ పాటించడం అవ స రమా అని ప్రశ్నించారు. మొదటి రోజు నుంచి ఇంటలిజెన్స్‌ నుంచి మొదలుకొని అన్ని కీలక ఆఫీసర్‌ నియామకంలో రెడ్డి కులతత్వమే కనిపిస్తుందనీ ప్రజలు సైతం ఆ విషయాన్ని గమనిస్తున్నారన్నారు. ఒక్క సింగల్‌ కాస్ట్కి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించారని సీఎం, అగ్రకులలలో బ్రాహ్మణా, కమ్మ , వెలమ వాళ్ళకి అవకాశాలు ఇచ్చారని అది సాధ్యం కాదని, నా తరవాత సీఎంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి అర్హులు అని రేవంత్‌ రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అర్హులు అని చెప్పా లేదని స్పష్టం చేశారు. బీసీ మంత్రిగా కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, గిరిజన మంత్రిగా సీతక్క, ఇతర జాతుల వారిలోదామోదర్‌ రాజనరసింహ, ఉండగా మైనార్టీ మంత్రి ఒక్కరూ లేరా?కాంగ్రెస్‌ పార్టీ నువ్వే గెలిపించి నట్టు అధిష్టానం నమ్మింది అందుకే సీఎంగా చేశారన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేస్‌ విచా రణలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ని సాంబ శివరెడ్డినే ఎం దుకు నియమించారనీ, రెడ్డియేతర ఆఫీసర్స్‌ పట్ల నమ్మకం లేదా అని ప్రశ్నించారు. నామినేషన్‌కి ఒక్క రోజు గడువు ఉన్న ఇంకా ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌లో ఎందుకు ఏకాభిప్రాయం రాలేదనీ ఎస్సీ రిజర్వేషన్‌ స్థానంలో ఎలా ఏకాభిప్రాయం వచ్చిందనీ సమాధానం చెప్పాలని, ప్రజల పక్షాన తాను అడుగుతున్నానని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. అత్యధిక శాతం ఉన్న బీసీలు ఎస్సీ ఎస్టీలను వేరువేరు చేసి చూస్తూ ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్న మైనారిటీలు సైతం వారి అభివద్ధికి తోడుపాటు అందించిన కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెప్పాలని తెలిపారు.

Spread the love