ఆశయాలు మీకుంటే అవకాశాలు ఎన్నో…

– అవకాశాలు అందిపుచ్చుకోవాలి : సివిల్‌ ర్యాంకర్‌ మెరుగు కౌశిక్‌
నవతెలంగాణ-ఓయూ
ఆశయాలు లక్ష్యాలు అంటూ మీకు ఉంటే సమా జంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఉన్నాయని ఇటీవలే సివిల్స్‌లో 82వ, ర్యాంకును పొందిన మెరుగు కౌశిక్‌ అన్నారు. బుధవారం సాయంత్రం ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మరియు ఇంజనీరింగ్‌ కళాశాల అల్యూమిని సంయుక్త ఆధ్వర్యంలో ”విద్యార్థులకు మొటివేషన్‌ అల్యూమినిటాక్‌ ”కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెరుగు కౌశిక్‌ మాట్లాడుతూ తాను ఒకవైపు జాబు చేస్తూనే ఎలా సివిల్స్‌ కు ప్రిపరేషన్‌ అయ్యా ను, లాక్‌డౌన్‌ సమయాన్ని ఆన్లైన్‌ క్లాస్‌ల ద్వారా ఎలా సద్వి నియం చేసుకున్నానో వివరించారు. తన అనుభ వాలను విద్యా ర్థులతో పంచుకున్నారు. ప్రిలిమ్స్‌కు ఎలా ప్రిపేర్‌ అయ్యాను తన ఇంటర్వ్యూ ఎలా జరిగిందో తాను వివరిం చారు. ఆశయం మనకుంటే అవకాశాలు ఎన్నో ఉన్నాయని ఆయన సూచించారు. ఇంజనీరింగ్‌ కళాశాల ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. పాల్గొన్న ఇంజనీరింగ్‌ విద్యార్థులు పలు సందేహాలు అడిగి నివత్తి చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొ.పైడిమర్రి చంద్ర శేఖర్‌, ఓయూ ఇంజనీరింగ్‌ కళాశాల అలుమిన అధ్యక్షుడు డాక్టర్‌ దేవరకొండ. విజరు కుమార్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ హెడ్‌ ప్రొ.రాజశేఖర్‌ పలు విభాగాల ప్రొపెసర్స్‌, విద్యా ర్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Spread the love