మూడు తరాల మానసిక విశ్లేషణ మట్టి మనిషి నాటకం

నవతెలంగాణ-కల్చరల్‌
ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ వాసిరెడ్డి సీతా దేవి రచిం చిన మట్టి మనిషి నవల మాస్టర్‌ పీసెస్‌ ఆఫ్‌ ఇండియన్‌ లిటరేచర్‌లో ఒకటి గా గుర్తింపు పొంది వివిధ భాషల్లో అనువాదం పొందింది. ఈ నవలను వ ల్లూరి శివ ప్రసాద్‌ నాటకీ కరణ చేయ గా రవీంద్ర భారతి ప్రధాన వేదిక పై నిభా థియేటర్‌ ఎసెంబుల్‌ హైదరా బాద్‌ వారి సమర్పణలో నస్రీన్‌ ఇషాక్‌ దర్శకత్వం లో ప్రద ర్శించారు. కూలీగా ఉన్న వ్యక్తి ఎంతో కష్టపడి రైతుగా కొంత భూమి సంపా దించు కొంటాడు. అయ న కొడుకు మరింత సంపాదించి భూ స్వామిగా మారు తాడు. తన తండ్రి ఎవరి వద్ద కూలీగా పనిచేశాడో అతని కుమార్తెను కోడలుగా తెచ్చుకుంటాడు. ఆమె వేరే వ్యా మో హలకు లోబడి భర్త ను నిర్లక్ష్యం చేస్తుంది. వారి కుమా రుడిని భర్త తన తండ్రి వద్దకు పంపుతాడు. మూడు తరాలకు చెందిన వ్యక్తుల మానసిక విశ్లేషణ సమాజంలో వర్గ సంబంధాలు కు అద్దం పడుతూ నాటకం సాగుతుంది. ఇందులో అనేక పాత్రలు ఉన్నప్పటికీ ప్రతి పాత్రా సందర్భోచితంగా కధలో ఇమిడి పోతుంది. రసారంజని నాటక సంస్థ నిర్వహణలో మట్టి మనిషి నాటకం ప్రదర్శన జరిగింది.

Spread the love