ఫాదర్‌ ఆఫ్‌ మోడరన్‌ ఇండియా రాజా రామమోహన్‌ రాయ్‌

నవతెలంగాణ-కల్చరల్‌
నాడు హిందూ ధర్మంలో ఉన్న ఎన్నో అమానవీయ ఆచారాలు అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమించి వాటికి వ్యతిరేకంగా బ్రిటిష్‌ ప్రభుత్వంచే చట్టాలు అమలు చేయించిన రాజా రామమోహన్‌ రాయ్‌ ఫాదర్‌ ఆఫ్‌ మో డరన్‌ ఇండియాగా తదుపరి కాలంలో గుర్తింపు పొందారని రాష్ట్ర పర్యాటక అభివధి సంస్థ పూర్వ చైర్మెన్‌ ఉప్పల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై గాన సభ నిర్వహణలో జరు గుతున్న దశాబ్ది పూర్వ మహనీయులు యాది లో భాగంగా రాజా రామమోహన్‌ రారు సంస్మరణ సమావేశం జరి గింది. ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్‌ పాల్గొని మాట్లా డుతూ నాడు సతీ సహగమనం నశ్రీశీ దుర్మార్గ ఆచారానికి వ్యతిరేకంగా పోరాడి బ్రిటిష్‌ వైస్రారు బెంటింగ్‌ చే సతీ సహగమనం వ్యతిరేక చట్టం చేయించిన రారు తొలి స్త్రీ పక్ష వాది అని నశ్రీవష్ట్రశ్రీసఱ. స్త్రీ విద్య, వితంతు వివా హం కోసం ఉద్యమించిన రారు బాల్య వివాహాల రద్దు కోసం చట్టం చేయించారని తెలిపారు. ప్రముఖ జర్నలిస్ట్‌ హాస్య అవధాని శంకర నారాయణ మాట్లాడుతూ సుమారు రెండున్నర శతాబ్దాల క్రితం సనాతన బ్రాహ్మణ కుటుం బంలో జన్మించిన రారు హిందూ ఆచారాలలోని దుర్మార్గా న్ని వ్యతిరేకించి వారి బహిష్కరణకు గురయ్యార న్నారు. బైబిల్‌ ఖురాన్‌ ఇతర మత గ్రంథాలను ఆయా భాషలు రారు నేర్చుకొని చదివి వాటి లోని లోపాలను ఎత్తి చూ పారని వివరించారు. బ్రహ్మ సభ స్థాపించి సోదర భావం సమానత్వం సౌభ్రాతత్వం ప్రచారం చేసి రవీంద్ర నాథ్‌ టాగూర్‌, స్వామి వివేకానంద వంటి వారికి ఆదర్శ ప్రా యులు అయినారని తెలిపారు. గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి అధ్యక్షత వహించిన వేదిక పై చంద్ర శేఖర్‌ గుండవరపు గీతా దేవి పాల్గొన్నారు.

Spread the love