ఐపీఎల్‌ టికెట్ల జారీలో కాసుల కక్కుర్తి

– నేడు నిరసన కార్యక్రమాలు చేపడతాం
– డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, పీవైఎల్‌, రాష్ట్ర యువజన సంఘాల
– ఐక్య కార్యాచరణ సమితి
నవతెలంగాణ-ముషీరాబాద్‌
ఐపీఎల్‌ టికెట్ల జారీలో పారదర్శకత పాటించ కుండా కాసులకు కక్కుర్తిపడి క్రీడాభిమానులకు వినోదాన్ని దూరం చేస్తున్నారని డీవైఎఫ్‌ఐ, ఏఐవై ఎఫ్‌, పీవైఎల్‌, రాష్ట్ర యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకుడు డిమాండ్‌ చేశారు. హెచ్‌ సీఏ బోర్డ్‌, సన్‌ రైజర్స్‌ ఫ్రాంచైజీ యాజమా న్యాల తీరును ఎండగడుతూ నేడు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలి పారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఐపీఎల్‌ టికెట్ల బ్లాక్‌ మార్కెట్‌ అంశంపై అరకొర ప్రకటన లు కాకుండా పూర్తి నివేదికను ప్రజలకు ప్రకటించాలని డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీవైఎఫ్‌ఐ), ఆల్‌ ఇండియా యూత్‌ ఫెడరేషన్‌ (ఏఐవై ఎఫ్‌), ప్రోగ్రె సివ్‌ యూత్‌ లీగ్‌ (పీవైఎల్‌) తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల ఐక్య కార్యా చరణ సమితి ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ. జావీద్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నెర్లకంటి శ్రీకాంత్‌ ,ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర, పీవైఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్‌. ప్రదీప్‌ లు మాట్లాడుతూ ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీ య క్రికెట్‌ స్టేడియంలో ఈ నెల 25న (నేడు) సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉందని, ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టికెట్లను గత శుక్రవారం విక్రయా నికి పెట్టారని, టికెట్లను పేటిఎంలో అమ్మకానికి పెట్టిన క్షణాల్లోనే టికెట్లను అమ్ముడు పోయా యంటూ బోర్డ్‌ ప్రకటించారని దాదాపు 36 వేలకు పైగా టికెట్లను అమ్మకానికి పెట్టిన అరగంట గంటలోపే ఏవిధంగా అమ్ముడుపోతాయో హెచ్‌ సీఏ, సన్‌ రైజర్స్‌ యాజమాన్యాలు రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు,టికెట్ల సమస్య పై, స్టేడియం నిర్వహణపై పూర్తి స్థాయి నివేదికను ప్రకటించాలని డిమాండ్‌ చేశా రు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు హస్మి, పీవైఎల్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి రవి కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love