స్వదేశీ సర్జికల్‌ రోబోతో చిన్నారికి శస్త్రచికిత్స

– ప్రీతి యూరాలజీ అండ్‌ కిడ్నీ ఆస్పత్రిలో పైలోప్లాస్టీ సక్సెస్‌
– తొలిసారిగా ఏడాది శిశువుకు ఏర్పాటు
నవతెలంగాణ-సిటీబ్యూరో
డాక్టర్‌ సుధీర్‌ ప్రేమ్‌ శ్రీవాస్తవ, కొందరు యువ భారతీయ ఇంజినీర్లు కలిసి ఎస్‌ఎస్‌ఐ మంత్ర అనే పూర్తి స్వదేశీ సర్జికల్‌ రోబోను రూపొందించారు. నగరానికి చెందిన ప్రీతి యూరాలజీ అండ్‌ కిడ్నీ ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ యూరాలజిస్టు డాక్టర్ర చంద్రమోహన్‌ వద్ది ఈ ఎస్‌ఎస్‌ఐ మంత్ర రోబోను ఉపయోగించి అద్భుతమైన విజయం సాధించారు. కేవలం ఏడాది వయసున్న ఓ చిన్నారికి ఈ రోబో సాయంతో పైలోప్లాస్టీ అనే శస్త్రచికిత్స చేసి, ఇంత చిన్న రోగికి రోబోటిక్‌ శస్త్రచికిత్స చేసిన తొలి వైద్యుడిగా పేరు గడించారు. కర్ణాటకలోని బీదర్‌ నుంచి ఈ చిన్నారిని నగరంలోని ప్రీతి యూరాలజీ అండ్‌ కిడ్నీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ శిశువుకు మూత్రపిండానికి, బ్లాడర్‌కు మధ్య ఉండే ప్రాంతంలో అడ్డంకులు ఉన్నట్టు గుర్తించారు. తాజాగా ఎడమవైపు మూత్ర పిండం వాయ డంతో ఇక్కడకు తీసుకొచ్చారు. న్యూక్లియర్‌ స్కాన్‌ చేసి చూడగా ఎడమవైపు కిడ్నీలో తీవ్రమైన అడ్డంకులు ఉన్నట్టు తేలింది. దీనికి లాప్రోస్కోపిక్‌ లేదా రోబోటిక్‌ శస్త్రచికిత్సలు మాత్రమే చేయాలి. ముందుగా తల్లిదండ్రులతో పూర్తి గా చర్చించి, వారి అనుమతి తీసుకున్న తర్వాత డాక్టర్‌ చంద్ర మోహన్‌ ఈ చిన్నారికి ఎస్‌ఎస్‌ఐ మంత్ర రోబో సాయంతో రోబోటిక్‌ పైలోప్లాస్టీ శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్‌ విజయ వంతం కావడంతో రోగిని డిశ్చార్జి చేయడానికి సిద్ధపడ్డారు. ఇకపై పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే సర్జికల్‌ రోబోలు రావడానికి మార్గం సుగ మమైందని డాక్టర్‌ చంద్రమోహన్‌ వద్ది ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్‌ఎస్‌ఐ మంత్ర అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిష్కారమని, ఇది మన దేశంలో సర్జికల్‌ ప్రక్రియలను విప్లవాత్మకంగా మారుస్తుం దన్నారు. మూత్రపిండానికి, బ్లాడర్‌కు మధ్య ఉండే జంక్షన్‌లో అడ్డం కులను తొలగించడానికి చిన్నపాటి రంధ్రం ద్వారా చేసే శస్త్రచికిత్సే రోబోటిక్‌ పైలోప్లాస్టీ. ఇందులో అడ్డంకులను పునర్నిర్మించేచందుకు రోబోటిక్‌ పరికరాలను ఉపయోగిస్తారు. తద్వారా అత్యంత కచ్చితంగా చేయడంతో పాటు త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.

Spread the love