తెలుగులోనూ మంజుమ్మల్‌  బాయ్సు

తెలుగులోనూ మంజుమ్మల్‌  బాయ్సు2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన స్ఫూర్తితో కొచ్చికి చెందిన కొంతమంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘మంజుమ్మల్‌ బాయ్సు’.
ప్రపంచ మార్కెట్‌లో రూ.200 కోట్లను సంపాదించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సష్టించిన ఈ చిత్రానికి చిదంబరం ఎస్‌ పొదువల్‌ దర్శకత్వం వహించారు. సౌబిన్‌ షాహిర్‌, గణపతి, ఖలీద్‌ రెహమాన్‌, శ్రీనాథ్‌ భాసి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకులనే కాదు ఇతర భాషా ప్రేక్షకులను అలరించి, అద్భుతమైన ఆదరణను పొందింది. ఈ ఇండియన్‌ బాక్సాఫీస్‌ సెన్సేషన్‌ను పాన్‌ ఇండియా ప్రొడక్షన్‌ హౌస్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రొడక్షన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఇప్పుడీ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 6న ఏపీ, తెలంగాణలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్‌ చేసింది. 2006లో కొడైకెనాల్‌లోని గుణాకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మల్‌ యువకుల నిజమైన అనుభవం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మాతలు.

Spread the love