ఎంజీఎం ఆస్పత్రిలో భారీ చోరీ..!

నవతెలంగాణ – వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో భారీ చోరీ చోటు చేసుకుంది. ఆరోగ్య శ్రీ వార్డులో చికిత్స పొందుతున్న రోగి భార్య మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెలుతాడు లాక్కొని గుర్తు తెలియని మహిళ పారిపోయింది. హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో ఎంజీఎం ఆరోగ్యశ్రీ వార్డులో చికిత్స పొందుతుండగా అతని సహాయకురాలుగా ఉన్న భార్య తెల్లవారుజామున ముఖం శుభ్రపరచుకునే క్రమంలో ఈ ఘటన జరిగిందట. ఈ విషయం తెలుసుకుని ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు వరంగల్ ఏసిపి నందిరాం నాయక్. అనంతరం పరిసర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత సెక్యూరిటీ లోపాలను సంబంధిత అధికారులకు తెలిపారు ఏసీపీ. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏసీపీ నందిరాం నాయక్. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love