
శంకరపట్నం మండల పరిధిలోని కొత్తగట్టు గుట్టపై గల శ్రీమత్స్య గిరీంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీమత్స్యగిరీంద్రస్వామి మత్స్యగిరీంద్రుడి రూపంలో మండలంలోని కొత్తగట్టు గుట్టపై వెలిశాడని ప్రతి సంవత్సరం శ్రీ మత్స్యగిరీంద్రస్వామి బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం, దేవదాయ ధర్మాదాయ శాఖ ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ జాతరకు వచ్చే భక్తులకు ఏలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని వసతులు సమకూర్చాలని ఏవోకు ఇట్టి దేవాలయానికి నూతన ధర్మకర్తల మండలిని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వం నియమించిందని, చైర్మన్ గా గ్రామ మాజీ ఎంపిటిసి ఉప్పుగళ్ల మల్లారెడ్డి కి ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలోచైర్మన్ ఉప్పుగల్లు మల్లారెడ్డి, మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాసు గౌడు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బసవయ్య గౌడ్,తదితరులు పాల్గొన్నారు.