విద్యార్థుల కష్టాన్ని తీర్చిన మెదక్ ఎంపీ..

– ఎంపీ స్వగృహంలో విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ
– హర్షం వ్యక్తం చేసిన విద్యార్థినీలు
– విద్యార్థుల పక్షాన మెదక్ ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన అచ్చుమాయపల్లి ఉపసర్పంచ్
నవతెలంగాణ- దుబ్బాక రూరల్
చదువుకునేందుకు కాలినడకన పాఠశాలకు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నా పర్శరాం నగర్ గ్రామ విద్యార్థినీల కష్టాలు నేటితో తీరాయి. గత కొద్ది రోజుల క్రితం దుబ్బాక మండలం అచ్చుమాయిపళ్లి పరిధిలోని పరశురాం నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ పాల్గొనగా..ఈ విషయాన్ని విద్యార్థులు ఎంపీ ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ బడులు ప్రారంభం కావడంతో విద్యార్థుల సమస్యకు చలించిపోయిన మానవతాదృక్పథంతో ఎంపీ తన స్వగ్రామమైన పోతారంలో బుధవారం 4 గురు విద్యార్థినీలకు సొంత ఖర్చులతో సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సైకిళ్ళు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ…విద్యార్థుల పక్షాన మెదక్ ఎంపీకి అచ్చుమాయపల్లి గ్రామ ఉపసర్పంచ్ పర్స దేవరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు తిరుపతి ,నరేందర్ రెడ్డి ,గ్రామ శాఖ అధ్యక్షుడు సత్యం, ఉపాధ్యక్షుడు రాజు, బూత్ అధ్యక్షుడు సంపతి రాజేందర్ , సీనియర్ నాయకులు నరసింహారెడ్డి ,మనోహర్ ,శ్రీనివాస్ ,దుర్గయ్య ,తదితరులు పాల్గొన్నారు

Spread the love