ఆళ్ళపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ పిలుపు మేరకు 7వ రోజు మధ్యాహ్న భోజనం కార్మికులు నిరవధిక సమ్మెలో భాగంగా స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి, ఎంపీపీతో కలిసి బొడ్డెమ్మలాడుతూ నిరసన వ్యక్తం చేశామని ఆ సంఘం మండల అధ్యక్షురాలు ఈసం అరుణ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో అల్పాహారం కోసం కార్మికులకు అదనపు గౌరవ వేతనం చెల్లించాలని ఖరాఖండిగా చెప్పారు. ఇప్పటి వరకు సకాలంలో సరిపడ ఇవ్వని డబ్బులతో మధ్యాహ్న భోజనం కార్మికులు కిరాణా షాపుల్లో అప్పులు చేసి, ప్రభుత్వం డబ్బులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేయడంతో మా బాధలు వర్ణనాతీతంగా మారాయని అన్నారు. శ్రమకు తగ్గ గౌరవ వేతనం, అల్పాహారం శ్రమకు సైతం డబ్బులు అదనంగా ఇచ్చే వరకు ఈ నిరవధిక సమ్మె వీడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని పక్షంలో సమ్మెను విప్లవ పార్టీలు, ప్రతిపక్ష పార్టీల సహాయం తీసుకుని ఉధృతం చేస్తామని వ్యాఖ్యానించారు. ధూకుంట్ల ముత్యాలు, చింత నర్సమ్మ, సిలివేరు నాగమణి, కొర్స కరుణ కుమారి, రాంబాయి, బాయమ్మ, రామలక్ష్మి, పడిగ నారాయణమ్మ, గొగ్గెల లక్ష్మి, పూనెం కన్నమ్మ, గొగ్గెల కన్నమ్మ, పాయం సుజాత, ఈసం నర్సమ్మ, సన్మ నాగమణి, బుడిగ మంగ, పూనెం బాయమ్మ, కొమరం సమ్మక్క, కొమరం లక్ష్మి, పూనెం జయ, కొమరం సుగుణ, పూనెం కన్నమ్మ, పూనెం నాగమణి, చింత నాగమణి, కొర్స లక్ష్మి, జోగ సావిత్రి, కందిమళ్ల సరస్వతి, గొగ్గెల లక్ష్మి, గొగ్గెల ఎర్రమ్మ, బొమ్మల సుశీల, పూసం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.