ఔట్ సోర్సింగ్ జవాన్ లకు కనీస వేతనం అమలు అమలు చేయాలి

– బిఎల్ టియు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్
నవతెలంగాణ – కంటేశ్వర్
వాటర్ సప్లై గార్డెన్స్ స్ట్రీట్ లైట్స్ ఔట్సోర్సింగ్ జవాన్ల కనీస వేతనం అమలు చేయాలి అని రాష్ట్ర అధ్యక్షులు దండ వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన మున్సిపల్ వాటర్ సప్లయ్ గార్డెన్స్ స్ట్రీట్ లైట్స్ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ కార్మికులవి చాలిచాలని వేతనాలన్నారు.నిత్యం పారిశుధ్యం, మించి నీళ్ళు అందించడానికి నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే మున్సిపల్ కార్మికులు  ప్రతిరోజు ఉదయం తెల్లవారు జామున నాలుగు గంటలకు నిద్ర లేచిన నుండి సాయంత్రం 7 గంటల వరకు పారిశుధ్యం, వాటర్ సప్లయ్, గార్డెన్స్, స్ట్రీట్ లైట్స్, ఫిల్టర్ బెడ్స్, సూపర్ వైజర్స్,  బిల్ కలెక్టర్స్, డ్రైవర్స్ , ఆఫీస్ తదితర స్టాఫ్ సెక్షన్ లలో ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారని, కానీ సరైన వేతనాలు అమలు చేయడంలేదని దండి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందిస్తున్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై త్వరలో ఆందోళన చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (బిఎల్ టియు) జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, బిఎల్ టియు జిల్లా ఉపాధ్యక్షులు కాంబ్లే మధు, నగర అధ్యక్ష, కార్యదర్శులు గంగా శంకర్, యాదయ్య, నాయకులు రాహుల్, హరీష్, మురళి, వసంత్, శ్రీశైలం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love