వ్యవసాయ కళాశాల ప్రదర్శనను తిలకిస్తూ ఎమ్మెల్యే మెచ్చా

– వ్యవసాయ కళాశాలలో పి.జి విభాగం ఏర్పాటుకు కృషి – ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన స్థానిక వ్యవసాయ కళాశాల లో పి.జి( పోస్ట్ గ్రాడ్యుయేషన్ ) విభాగం ఏర్పాటుకు కృషిచేస్తానని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు విద్యార్ధులకు హామీ ఇచ్చారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆదేశాల మేరకు తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం కళాశాలలో నిర్వహించిన రైతు దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ విద్యాపరమైన ప్రదర్శనను ఆయన తిలకించారు.విద్యార్ధులు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర గీతాల,పాటలు పోటీలను ఆలకించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత స్థాయికి వెళ్ళి రాష్ట్ర రైతాంగానికి నూతన సాంకేతికతను త్వరితగతిన అందించాలని సూచించారు.కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ తెలంగాణా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పది సంవత్సరాలు లో ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖర్ రావు తలపెట్టిన రైతు బందు,కళ్యాణ లక్ష్మి, టి – హబ్,వి – హబ్,మొదలైన నూతన ఒరవడి లను కొనియాడారు.  కార్యక్రమంలో స్థానికి ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి,మందపాటి రాజ మోహన రెడ్డి,కాసాని చంద్రమోహన్,యు.ఎస్ ప్రకాష్ పాల్గొన్నారు.  వ్యవసాయ ఎగ్జిబిషన్ లో హైడ్రో ఫోనిక్స్,వానపాముల ఎరువు తయార వ్యవసాయ పనిముట్లు వ) నూతన వంగడాల విత్తనాలు, వ్యవసాయానికి సంబందించిన చిత్రపటాలు,ఇంకా ప్రైవేట్ కంపెనీలో ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ఇఫ్కో,ఆయిల్ ఫాం కు సంబంధించి సూక్ష్మ పోషకాలు అనే అంశం పై డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి, ఉద్యానవన శాస్త్రవేత్త ఆయిల్ పామ్ సాగు లోని యాజమాన్య పద్ధతులు వివరించారు. ఈ కార్యక్రమంలో బోధనా సిబ్బంది వై.జి.కే మూర్తి,వెంకన్న, మధుసూధన్ రెడ్డి,రాంప్రసాద్,శిరీష లు పాల్గొన్నారు.

Spread the love