ఇంటర్ ఫలితాల్లో మోడల్ ఫలితాలు

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామపరిదిలోగల జంగిడిపల్లిలో ఉన్న తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఈ సంవత్సరం ఇంటర్ ప్రథమ,ద్వితీయ పరీక్షల ఫలితాల్లో  మో ,డల్, పాఠశాల వెనుకబడింది.పాఠశాలలోని ప్రథమ సంవత్సరంలో  ఎంపిసి, బైపీసి, సిఇసి గృపుల్లో మొత్తం విద్యార్థులు 63 విద్యానభ్యసించగా 13 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులై  21 శాతం సాధించారు.ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 63 మంది విద్యార్థులు విద్యానభ్యసించగా 20 మంది ఉత్థిర్ణులై 32 శాతం సాధించారు.ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపిసిలో  ఎన్. స్వెత 431,ఎంపిసి సెంకర్ ఇయర్ లో టి.విజయ్ కుమార్ 935,  సిఈసి పస్ట్ ఇయర్ 477 వైష్ణవి,  సెకండ్ ఇయర్ లో 732 పూర్ణ చందర్ సాధించి  కళాశాల టాపర్లుగా నిలిచినట్లుగా కళాశాల ప్రిన్స్ పాల్ ధూడ వెంకటేశ్వర్లు తెలిపారు.
తాడిచెర్ల కళాశాలలో తగ్గిన ఉత్తీర్ణత
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ రిజల్ట్ గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత పడిపోయింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మొత్తం 68 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 15 మంది ఉత్తీర్ణులై 22 శాతం సాధించారు.ఇంటర్ రెండవ సంవత్సరంలో మొత్తం విద్యార్థులు 59 మంది పరీక్షకు హాజరు కాగా 17 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 28 శాతం సాధించారు.ఎంపిసి ప్రథమ సంవత్సరంలో 438 మార్కులతో కాలేజి టాపర్ గా రామిడి చాందిని,సెకండ్ ఇయర్ 892 మార్కులు లింగం మీనాక్షి, బైపిసి సెకండ్ ఇయర్ 854 మార్కులు నవిత,సిఈసి సెకండ్ ఇయర్ 617 మార్కులతో సూరం రమ కాలేజి టాపర్లుగా నిలిసినట్లుగా కళాశాల ఇంఛార్జి  ప్రిన్స్ పాల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
కాస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో…
మండలంలోని దుబ్బపేటలోని కాస్టూబ్బా గాంధి ఆశ్రమ పాఠశాలలో ఎంపీ హెచ్ డబ్యూ ఫస్ట్ ఇయర్ లో 15 మంది బాలికలకు 12 మంది ఉత్తీర్ణులై, 80 శాతం, ఎంపి హెచ్ డబ్ల్యూ సెకండ్ ఇయర్ లో 13 మంది బాలికలకు 12 మంది బాలికలు ఉత్తీర్ణులై, 92 శాతం సాధించారు.సిఈసి సెకండ్ ఇయర్ లో 10 బాలికలకు ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణులై 20 శాతం సాధించారు.ఎంపీ హెచ్ దబ్యూ ప్రథమ సంవత్సరంలో 424 మార్కులతో ఎస్ నందిని, సెకండ్ ఇయర్ 839 మార్కులతో పి మల్లీశ్వరి కాలేజి టాపర్స్ గా నిలిచినట్లుగా కళాశాల ప్రిన్స్ పాల్ వెన్నెల తెలిపారు.
Spread the love