తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

rain .img

నవతెలంగాణ – హైదరాబాద్
పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా ముత్తారం(పెద్దపల్లి జిల్లా)లో 4.3 సెంటీమీటర్లు, లక్ష్మీనగర్‌(సంగారెడ్డి)లో 3.8, మల్లంపల్లి(ములుగు)లో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉన్నాయి.

Spread the love