కూలీ చేయకుండానే డబ్బులు

– ప్రయివేట్ ఉద్యోగి, రాజకీయ నాయకులకు ఉపాధి డబ్బులు
– ఇంట్లో ఉన్న మహిళలకు కూలీ డబ్బులు
– హాజరు వేస్తే సగం సగం కూలి డబ్బులు
– పనులు చేసిన వారికి అన్యాయం
– కూలి చేసిన వారికి సరిగా డబ్బులు రాక ఇబ్బందులు
నవతెలంగాణ – మాక్లూర్ 
తప్పుడు మస్టర్లు, పనుల్లో అక్రమాలు, వేతనాల్లో కోత వంటి వాటికి ఉపాధి హామీ పథకం చిరునామాగా మారింది. ఉపాధి కూలీల హాజరు, పనుల వివరాల నమోదులో ఉన్న లొసుగులు అనేక అక్రమాలకు తావిచ్చాయి. తక్కువ మంది పనులు చేసినా ఎక్కువ మందికి మస్టర్లు వేసి వేతనాలు పక్కదారి పట్టించారు. కందకాలు, ఊటకుంటల తవ్వకం పనులు ఎక్కువ కొలతలతో రికార్డు చేసి అదనంగా బిల్లులు డ్రా చేయడం, హరితహారంలో తక్కువ గుంతలు తీసి ఎక్కువ నమోదు చేయటం, కొన్ని ప్రాంతాల్లో పాత పనులను కొత్తగా చేసినట్లు చూపటం ద్వారా పెద్ద మొత్తంగా నిధులు దండుకున్నారు. ఈ అక్రమాలు ఏమాత్రం బయటకు పొక్కకుండా సాంకేతికంగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనే అల్లూరు మండలంలోని కల్లేడ గ్రామంలో ఉపాధి హామీలో చోటు చేసుకుంది.
కూలి చేయకుండానే హాజరు, డబ్బులు: కల్లేడ గ్రామంలోని ఉపాధి హామీ పథకంలో పిల్డ్ అసిస్టెంట్ అతుత్సహం ప్రదర్శించి కూలి చేయకుండానే హాజరు వేసి వారికి డబ్బులు ఇచ్చిన సంఘటన గ్రామంలో ఆశ్చర్యనికి గురి చేస్తుంది. కూలి చేసిన వారికే సరిగ్గా డబ్బులు రాక ఆందోళన చెందుతుంటే చేయని వారికి ఎలా వస్తున్నాయని అంటున్నారు.
ప్రయివేట్ ఉద్యోగికి, రాజకీయ నాయకులకు హాజరు: నిత్యం కూలికి వెళ్ళే వారితో పాటు ప్రయివేట్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి, రాజకీయ నాయకులకు, ఇంటివద్ద ఉన్న మహిళలకు హాజరు వేసి డబ్బులు ఇప్పించారు.
ఆరుగురు పని చేస్తే పది మందికి పంచడం: ఒక గ్రూపులో ఆరుగురు ఉపాధి హామీలో కూలి పని చేస్తే, వారం తరువాత మరో నలుగురి పేర్లు అందులో వ్రాసి ఆరుగురు చేసిన పనిని పది మందికి పెంచుతున్నారు. దీనితో నిజాయితీగా కూలి చేసిన వారికి న్యాయం జరుగుతుంది.
సగం డబ్బులు ఇవ్వాలి ఒప్పందం: ఉపాధిహామీలో కూలి పనులకు రాకుండానే హాజరు వేసిన వ్యక్తికి సగం డబ్బులు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకొని హాజరు వేస్తున్నారు. ఇంట్లో ఉంది సగం డబ్బులు పొందుతున్నారు. వారితో పాటు హాజరు వేసిన వ్యక్తి కూడా ఆదాయం పొందుతున్నారు.
ఈ వ్యవహారం గత సంవత్సరం 2023 జూన్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగిన స్థానికులు తెలుపుతున్నారు. ఇలాంటి వారిపై కటిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
పరిశీలిస్తున్నాం: ఎంపీడీఓ క్రాంతి.. కల్లేడ గ్రామంలోని ఉపాధి హామీ పై మకు పిర్యాదులు వచ్చాయి. దానిపై పరిశీలిస్తున్నాం. అక్రమాలు జరిగితే చర్యలు తీసుకుంటాం.
Spread the love