– సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ – కంటేశ్వర్
మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల పోరాట కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు నాందేవ్ వాడలోని సిపిఎం కార్యాలయంలో జరిగాయి, ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి మతోన్మాద చర్యలకు పాల్పడుతుందని అన్నారు, మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలను సృష్టించి తమ రాజకీయ పబ్బం నెట్టుకొస్తున్నారని అన్నారు, బిజెపి మత విద్వేష రాజకీయాలను ప్రజల ఐక్యంగా తిప్పి కొట్టాలని ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట రాములు, మల్యాల గోవర్ధన్, నగర కార్యదర్శి పెద్ది సూరి, నగర కమిటీ సభ్యులు ధ్యారంగుల కృష్ణ, బొప్పిడి అనసూజ, తదితరులు పాల్గొన్నారు.