చట్టసభలలో ముదిరాజులకు ప్రాధాన్యత కల్పించాలి

నవ తెలంగాణ-రాయపోల్
బీసీ ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని చట్టసభలలో తీవ్ర అన్యాయం జరుగుతుందని ముదిరాజ్ సంఘం రాయపోల్ మండలం నాయకులు అన్నారు. ఆదివారం రాయపూర్ మండల కేంద్రంలో జిఎల్ఆర్ గార్డెన్లో బీసీ ముదిరాజ్ సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ముదిరాజులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీసీలలో అధిక జనాభా ఉన్నది ముదిరాజులమని కానీ చట్టసభలలో అవకాశాలు మాత్రం కల్పించకుండా అణచివేస్తున్నారు.రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 53% జనాభా ఉన్న బీసీలకు తక్కువ స్థానాలు కేటాయించి వివిధ పార్టీలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్నారు. అలాగే ముదిరాజులను బిసి-డీలో నుండి బీసీ-ఏలో చేర్చాలని కోరారు. ముదిరాజు సంఘ నాయకులు ఏ పార్టీలో ఉన్న అందరం ఏకమై ముదిరాజ్ సంఘ నాయకులను గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్, బిజెపి నాయకులు నీల స్వామి, రొయ్యల శ్రీనివాస్, బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు స్వామి, నాయకులు శ్రీనివాస్, స్వామి, సత్తయ్య, ఆంజనేయులు, యాదగిరి, రాజు, వీరేశం, ప్రభాకర్, వెంకటేష్, సింగరబోయిన స్వామి, నరేష్, మధు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love