నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం చాకలి ఐలమ్మ

నవ తెలంగాణ-రాయపోల్
నేటి సమాజంలో మహిళ లోకానికి స్ఫూర్తిదాయకం చాకలి ఐలమ్మ పోరాటమని ఆమె పోరాట చైతన్యం స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని రాయపోల్ ఎస్సై రఘుపతి, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పరశరాములు, అన్నారు. ఆదివారం రాయపోల్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 38 వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకార్లు, భూస్వాములకు ఎదురొడ్డి పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ నేటి మహిళా స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కుల సంఘాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పిన ముఖ్యమంత్రి గారు రజకులను మాత్రం చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతకింది మంజూరు,స్వామి, మహేష్, కృష్ణ, లచ్చయ్య, బిక్షపతి, కరుణాకర్, మల్లేష్, ఇసాక్, రాజు, బుధవ్వ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love