బీజేపీ, బీఆర్‌ఎస్‌ కు ముదిరాజ్ లు ఈ ఎన్నికల్లో ఘోరి కాడ్తరు..

– రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ కులస్తులు కాంగ్రెస్ కే మద్దతు..
– నట్టేట్ట ముంచిన ఆ రెండు పార్టీలు..
– మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి..
నవతెలంగాణ- డిచ్ పల్లి:  ఎన్నికల్లో గెలవగానే ముదిరాజ్ కులస్తులకు ఇచ్చిన హామీలను, ముదిరాజ్ల డిమాండ్లను నెరవేరు స్తామని గతంలో, ఇప్పుడు హామీ లిచ్చి ముదిరాజ్ కులస్తులకు ఆర్థికంగా, సామాజికంగా ఎదగకుండా బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రపూరితంగా వ్యావహరించయని,ఈ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించి చుక్కలు చూపిస్తామని దర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి అన్నారు. సోమవారం సాయంత్రం ఇందల్ వాయి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజుల ప్రధాన డిమాండ్లలో బీసీ డీ నుండి ఏలోకి మార్చడం ఉందన్నారు. గత 15 ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ డీ నుండి ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నేటి వరకు అమలు చేయలేదన్నారు బీఆర్‌ఎస్‌ ముదిరాజ్ కులస్తులకు రాష్ట్రవ్యాప్తంగా కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజులు 50 లక్షలకు పైచిలుకు ఉన్నారని నిజామాబాద్ జిల్లాలో మూడు లక్షల పైచిలుకు జనాభా కలిగి ఉన్నామన్నారు ఈనెల 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థులకు ఓటు వేయకుండా ముదిరాజులు సంఘటితమై కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించుకుంటామని ఇమ్మడి గోపి పేర్కొన్నారు. కాంగ్రెస్ కాంగ్రెస్ ఏకైక పార్టీ బీసీ డిక్లరేషన్ లో కర్ణాటక ముఖ్యమంత్రి ద్వారా ప్రకటించిందని ముదిరాజ్ కులస్తులకు బిసి నుండి ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చిందన్నారు. బీఆర్‌ఎస్‌ బిజెపి పార్టీలతో విసిగెత్తిపోయామని, గతంలో బీఆర్‌ఎస్‌ర్టీ చెరువులపై సభ్యత్వం తో పాటు ఐదు ఎకరాలు భూమి ఇస్తామని వాగ్దానం చేసిందని ఆయన అన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఇంత జనాభా ఉన్న బీఆర్‌ఎస్‌ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదని,  కాంగ్రెస్ బీజేపీ సైతం అదే కోవకు చెందిందని బీజేపీ బీఆర్‌ఎస్‌ ఒకటే తాను ముక్కలు అన్నారు.ముదిరాజ్ కుల వృత్తులైన పండ్లు, ఫలాలు పండించుకోవడానికి ప్రతి గ్రామంలో ఐదెకరాల పండ్లతోట పెట్టుకోవడానికి భూమి, మండల కేంద్రంలో రూ.25 లక్షలతో ముదిరాజ్ కల్యాణమం డపం, ముదిరాజ్లు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవగానే ఇచ్చిన హామీలను పూర్తి చేస్తుందని పేర్కొ న్నా నేటి వరకు అమలుకు నోచుకోలేదన్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ముదిరాజులు ఉంటారని ఆయన అన్నారు. బీజేపీ సీఎం అని ప్రకటిస్తూ డ్రామా ఆడుతుందని అలాంటప్పుడు ఆ ముఖ్యమంత్రిని ప్రకటించేది ఉండేదని అలా కాకుండా ప్రజలను మభ్యపెట్టడానికి బీసీ కార్డును ఉపయోగిస్తుందన్నారు బీసీకి చెందిన సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉంటే జీర్ణించుకోలేక ఆయనకు సాగనంపారని బీజేపీ బీఆర్‌ఎస్‌ కలిసి ఆడే నాటకంలో భాగమన్నారు. బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలో ముదిరాజ్ సంక్షేమాన్ని విస్మరించిందని ఎలాంటి హామీ ఇవ్వకుండానే మేనిఫెస్టో ప్రకటించిందని ఎద్దేవ చేశారు నిజామాబాద్ నిర్మల్ జిల్లాలోని ముదిరాజ్ కులస్తులకు చెరువులపై హక్కు లేదని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు మండలాల్లో ముదిరాజులు సభ్యత్వం కలిగి ఉన్నారన్నారు. ముదిరాజులతో ఓట్లు వేయించుకొని మోసానికి పాల్పడ్డ ఈ రెండు పార్టీలకు చెందిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ముదిరాజ్ కులస్తుల్లారా మేలుకొని లాభం లేని బీజేపీ బీఆర్‌ఎస్‌ కు బొంద పెట్టే సమయం ఆసన్నమైందనరు. ఈ ఎన్నికల్లో ముదిరాజులు పెద్దన్నపాత్ర పోషించి సత్త ఏమిటో చూపిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు చోట్ల ముదిరాజులకు ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లు కేటాయించిందని ఇదే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు ఎకరాల పండ్లతోటలకు భూములను కేటాయిస్తామని బీసీ డీ నుండి ఏలోకి మారుస్తామని హామీ ఇచ్చిందని ఉమ్మడి గోపి వివరించారు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ గ్రామానికి వెళ్లిన అక్కడ ముదిరాజులు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రజలు ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా గలం వినిపిస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండు ఒకే మాట ఒకే బాట మీద ప్రయాణించే పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఇమ్మడి గోపి ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు ఫైనాన్స్ గంగాధర్, ప్రశాంత్,గంగాధర్, ప్రవీణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love