మృతుల కుటుంబాలను పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా శుక్రవారం ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించి ఓదార్చారు. మండల కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర పాలక మండలి సభ్యులు కొత్తపల్లి ప్రసాదరావు తల్లి కొత్తపల్లి పద్మావతి, భాండావత్ కవిత అలాగే దుంపెల్లి గూడెం గ్రామానికి చెందిన వెన్నంపల్లి నర్సమ్మ గారు, గ్రామ ఉపాధ్యక్షులు కట్ల జనార్దన్ రెడ్డి తండ్రి గారైన కట్ల వెంకట్ రెడ్డి గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాలను ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క గారు పరామర్శించి వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆకుతోట చంద్రమౌళి, చింతనిప్పుల బిక్షపతి, వంగ రవి యాదవ్, గుండబోయిన అనిల్ యాదవ్, పాలడుగు వెంకటకృష్ణ, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, సూడి సత్తిరెడ్డి, సామ చిట్టిబాబు, బొల్లు కుమార్, మూడ్ ప్రతాప్, సామ నరేందర్ రెడ్డి, లక్ష్మణ్, కట్ల జనార్దన్ రెడ్డి, నన్నెబొయిన సోమయ్య, కందుల అశోక్, మేడ ఎల్లారెడ్డి, సామ హన్మంత రెడ్డి, పెండెం శ్రీకాంత్, లావుడియ లక్ష్మీ- జోగ నాయక్, గోపిదాసు ఏడుకొండలు, మద్దాలి నాగమణి, సూదిరెడ్డి జయమ్మ, గోపిదాసు వజ్రమ్మ, కట్ల ప్రమీల, అనిత, కుమారి తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love