ఖురాన్‌ దహనాలపై ముస్లిం ప్రపంచం నిరసన

డెన్మార్క్‌ : స్వీడన్‌ రాజధానుల్లో జరిగిన నిరసనల్లో ఖురాన్‌ దహ నాలను పదేపదే అనుమతించటంపట్ల ముస్లిం దేశాలు తీవ్రంగా విమర్శిస్తు న్నాయి. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌ హాగన్‌లో ముస్లిం పవిత్ర గంథం ఖురాన్‌ను కాళ్ళ కింద తొక్కుతూ ధ్వంసం చేసిన ఘటన సోమవారం నాడు జరిగింది. డానిష్‌ పేట్రి యాట్స్‌ పేరుగల పచ్చి మితవాత గ్రూపు ఒకటి ఇరాక్‌ రాయబార కార్యాల యం ఎదుట జరిపిన నిర సనను టర్కీ ఖండించింది. ‘మా పవిత్ర గ్రంథంపై చేస్తున్న దాడి’గా టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణిం చింది. ఇటువంటి చర్యలు పునరా వృతం కాకుండా తగిన చర్యలు తీసు కోవాలని డానిష్‌ అధికారులను టర్కీ కోరింది. ‘ఇటు వంటి తీవ్ర చర్యలకు పాల్పడే సమాజాలు టెర్రరిజం బారీన పడటమే కాకుండా, అవి సృష్టించే ద్వేషం సహ జీవనాన్ని దెబ్బతీస్తుంది’ అని ఇరాక్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కోపెన్‌ హాగన్‌లో గతవారం జరిగిన సంఘట నను డానిష్‌ పాట్రియాట్స్‌ ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ చేయటంతో ఇరాక్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అదేరోజు డానిష్‌ రాయబార కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులందరూ బాగ్దాద్‌ను వదిలి వెళ్ళారని ఇరాకీ మంత్రిత్వశాఖ ప్రకటించింది. తమ రాయబార కార్యా లయాన్ని వేసవి సెలవులకోసం మూసి వేశామనీ, ఉద్యోగులను ఉపసంహ రించుకోలేదని డెన్మార్క్‌ తెలిపింది.

Spread the love