ఎన్నికల నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి

–  పిఓ ఎపిఓ ట్రైనింగ్ లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వి.హనుమ నాయక్
నవతెలంగాణ-రామగిరి: పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంథని అసెంబ్లీ సెగ్మెంట్ కు కేటాయించబడిన పిఓ/ఏ‌పిఓలకు ఈవిఎం, వివి ఫ్యాట్, బ్యాలట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ ల పై పోలింగ్ అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, మంథని రెవెన్యూ డివిజినల్ అధికారి హనుమ నాయక్ అన్నారు. రామగిరి మండల కేంద్రంలోని సెంటినరి కాలని జె ఎన్ టి యు కళాశాలలో పిఓ,ఎపిఓ అధికారులకు గురువారం ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమం లో పాల్గొనీ మాట్లాడారు.. మే 13న జరిగే పోలింగ్ ను విజయవంతం చేసేందుకు పోలింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ నియమ నిబందనలు, మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మాక్ పోల్ నిర్వహణ, ఈవిఎం యంత్రాల పని తీరు, బ్యాలట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ఫ్యాట్ ల కనెక్షన్లు వాటి పని తీరు రిపేరు వస్తే తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించినారు. అలాగే మంథని నియోజకవర్గంలోని అన్నీ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపి ఎన్నికకు 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున అలగే నోట తో పాటు 43 మంది ఉన్నందున 3 బ్యాలెట్ యూనిట్స్ ఉపయోగించటంలో తర్ఫీదు పొందగలరని సూచించారు. ఈ కార్యక్రమం లో ట్రైనింగ్ నోడల్ అధికారి కమాన్ పూర్ తహశీల్దార్, ఎండి అరీఫోద్దీన్, రామగిరి తహశీల్దార్ బి రాంచందర్ రావు, నాయబ్ తహశీల్దార్ కమాన్ పూర్ సుదాటి కోటేశ్వర్ రావు, మాస్టర్ ట్రైనర్స్ గోపు రవీందర్ రెడ్డి, హరి ప్రసాద్, భరత్ రెడ్డి, రాజేశ్వర్ రావు తదితరుల తో పాటు పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love