తెలంగాణ రాష్ట్ర సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ముత్యం శంకర్ గౌడ్

నవతెలంగాణ కరీంనగర్:  తెలంగాణ రాష్ట్ర సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరుశరాములు గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని స్థానిక గణేష్ నగర్ లో సంఘం రాష్ట్ర కార్యాలయంలోజరిగింది . ఈ సమావేశానికి అతిథులుగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గణగాని సత్యనారాయణ గౌడ్ ( కలర్ సత్తన్న ), సభ్యులు సంపునూరి మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరుశరామ్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం12 మందితో దళాన్ని దండు కట్టి 12 వేల సైన్యాన్ని తయారుచేసి గోల్కొండ వైపు వెళ్తున్న మొఘల్ సామ్రాజ్యవాదం అంతం చేసి సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల రాజుగా రాజ్యాధికారాన్ని చేపట్టారనితెలిపారు. అందుకే మన సంఘం గీతా కార్మికుల బతుకులు మార్చేందుకు కష్టాలను తొలగిస్తూ హక్కుల సాధన కోసం ఉద్యమించడమే మన అందరి లక్ష్యం కావాలని పరుశరాములు గౌడ్ పేర్కొన్నారు. గత 12 ఏండ్లుగా సర్వాయి పాపన్న గుట్టలను గ్రైనేట్ వ్యాపారుల నుండి కాపాడడం జరిగిందని సర్వాయి పాపన్న చరిత్రను ప్రజలకు తెలిసే విధంగా ప్రభుత్వం పాఠ్య పుస్తకాల లో చేర్చాలని వారు ప్రభుత్వాన్నికోరారు. ఇందులో నూతన కమిటీని ఎన్నుకోనైనది నూతన జిల్లా అధ్యక్షులుగా ముత్యం శంకర్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందనికోడూరి పరుశరామ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ముత్యం శంకర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ గ్రామీణ గీత కార్మికులను సంఘటిత పరిచి గీత కార్మికుల సమస్యలను పరిష్కరించుకొనుటకు ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి గీత కార్మికులకు రావలసిన హక్కులను సాధించుకుంటామని వారు పేర్కొన్నారు. గీత కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు రావలసిన ఎక్స్గ్రేషియా త్వరగా వచ్చేందుకు నా వంతు కృషి చేస్తారని, ఆస్పత్రి ఖర్చులను 50 వేలు దహన సంస్కార ఖర్చులకు లక్ష రూపాయలు చెల్లించుటకు ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గీత కార్మికులు ప్రమాదన బారిన పడకుండా సేఫ్టీ మొకులు ప్రభుత్వం ఇవ్వాలన్నారు. గీత కార్మికుల హక్కుల సాధన ద్యేయంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు. ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి, అందులో నాటేందుకు ఈత వనం చెట్లు ప్రభుత్వ ఉచితంగా ఇవ్వాలన్నారు. నా యొక్క ఎన్నికకు సహకరించిన రాష్ట్ర జిల్లా నాయకత్వానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
       జిల్లా అధ్యక్షునిగా కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన ముత్యం శంకర్ గౌడ్, గౌరవ అధ్యక్షులుగా పంజాల రామ్ శంకర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వీణవంక మండలానికి చెందిన దోమ్మాటి రాజమల్లు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులుగా జమ్మికుంటకు చెందిన పల్లెల కొమురయ్య గౌడ్ చిగురుమామిడి మండలం చెందిన బుర్ర పరశురామ్ గౌడ్, లను ఏకగ్రీవంగా ఎన్నుకోనైనదని జిల్లాలోని 16 మండలాల గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love