నా ఆరోగ్యం నా హక్కు

– హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జె.వెంకటి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యం అనే పదానికి వ్యాధి, అంగ వైకల్యం లేకపోవడమే కాకుండా సంపూర్ణ శారీరక, మానసిక, సామాజిక స్వస్థతను కలిగి ఉండే స్థితిగా నిర్వచిం చిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరపు నినాదం నా ఆరోగ్యం – నా హక్కుని గురించి చర్చించే ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న ఈ అద్భుత నిర్ణయం గురించి తెలుసు కోవాలి అన్నారు. అదే 1978 అల్మా – ఆటా 2000 సంవత్సరం నాటికి అందరికీ ఆరోగ్యం అనే ఈ డిక్లరేషన్‌ ప్రజారోగ్య తీరుతెన్నులను మార్చిందన్నారు. వ్యాధి చికిత్స నుంచి నివారణకు, నివారణ నుంచి సంపూర్ణ స్వస్థత వైపు ప్రపంచ ఆరోగ్య రంగాన్ని చూసేలా చేసిందన్నారు. ఇందు లో ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ భావనలను విశదీకరిం చిందన్నారు. ప్రతీ మానవునికి మంచి ఆరోగ్యం పొందే హక్కు ఉందని, మనిషికి కావాల్సినకనీస ఆరోగ్య అవసరా లైన స్వచ్ఛమైన గాలి, పరిశు భ్రమైన నీరు, పోషకాలతో కూడిన ఆహారాన్ని, ఈ యుద్ధాలు, విధ్వంసం, శిలాజ ఇంధ న వినియోగం, అవసరాన్ని మించిన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయన్నారు. ఈ ఆరోగ్య హక్కుకు భంగం కలిగించే ప్రత్యక్ష, పరోక్ష కారకాల నుంచి మానవుడికి స్వేచ్ఛ లభించినప్పుడే అతడికి ఆరోగ్య హక్కు సాకారమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఐఓ డాక్టర్‌ శ్రీకళ, ఎస్‌బీహెచ్‌ఓలు, మాస్‌ మీడియా అధికారి రాములు, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love