ఎమ్మెల్యే హనుమంతు షిండే పై నారాజ్

– పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న ముఖ్యనేతలు
నవ తెలంగాణ మద్నూర్: బీఆర్ఎస్ పార్టీకి ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పనితీరు పట్ల ముఖ్యనాయకులు నారాజ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. మద్నూర్ మండలంలోనే కాకుండా నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో కూడా బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీకి దూరమయ్యే అవకాశాలు జోరుగా కనిపిస్తున్నాయని చర్చలు వినబడుతున్నాయి. మద్నూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం ఇదే జరుగుతే మద్నూర్ మండలంలోనే కాకుండా నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో కూడా ఎమ్మెల్యే హనుమంతు షిండేకు తిరుగుబాటు అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నప్పటికీ జుక్కల్ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే పట్లనే నారాజ్ గా ఉన్నట్టు వినికిడి. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు గెలుపు కోసం ఎంతో బాగా సలహాలు సూచనలు అందించిన పార్టీలో ఎవరైనా నారాజ్ గా ఉన్న అలాంటి వ్యక్తి ఇండ్లకు వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేయాలని ఆదేశించినప్పటికి జుక్కల్ నియోజకవర్గంలో అలాంటి ప్రయత్నాలు జరగడంలేదని చర్చలు వినబడుతున్నాయి. ఎవడు ఉంటే ఎవడు పోతే నా గెలుపుకు అడ్డు లేరని ధీమాతో హనుమంతు షిండే ఉన్నారని వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకే సరిపోదు ప్రజల బాగోగులు చూసుకున్న వారే నాయకులు అలాంటి వాటి పట్ల తమకేమీ చేశాడని నారాజ్ లో నాయకులు కార్యకర్తలు ఉన్నట్లు ఎన్నికల ప్రచారంలో ఈపాటికి ఎమ్మెల్యే వెంటా ముఖ్యనాయకులు కనిపించకపోవడం పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి అదే జరిగితే హనుమంతు షిండే గెలుపుకు దెబ్బనే అనుకోవచ్చు.

Spread the love