నెమలి ఉదయ్ మెమోరియల్ ట్రస్ట్ వరద బాధితులకు అన్నదానం..

నవతెలంగాణ -గోవిందరావుపేట
నెమలి ఉదయ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని వరద బాధితుల పునరావాస కేంద్రంలోని బాధితులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత పేదరికంలో జన్మించిన నెమలి నర్సయ్య పిల్లలను ఉన్నత విద్యావంతులుగా ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో తన కుమారుడు నెమలి ఉదయ సాయి కేంద్ర ప్రభుత్వ సర్వీస్ల  కేంద్ర హోం అఫైర్స్ డిపార్ట్మెంట్  లో సెంట్రల్ బీసీ వెల్ఫేర్ కమిషన్ ఉద్యోగం చేసేవాడని అంత పెద్ద స్థాయిలో ఉద్యోగం చేస్తూ అకాల మరణం చెందడం ఆ కుటుంబానికి తీరని లోటని ఉదయ్ నెమలి ని ఆదర్శంగా తీసుకొని నేటి యువతీ యువకులు గొప్ప చదువులు చదివి కులము వర్గము మతం అనే తేడా లేకుండా దేశం కోసం పేద ప్రజల కోసం పాటుపడాలనిపిలుపునిచ్చారు.నేడు ఉదయ్ నెమలి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమం చాలా గొప్ప విషయమని ఉదయ్ లేని లోటును పూడ్చలేకున్నా ఆ కుటుంబానికి మా వంతు సహకారం తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నెమలి ఉదయ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నెమలి సమ్మక్క తల్లిదండ్రులు నెమలి నర్సయ్యా, స్వరూప డాక్టర్ నెమలి గాంధీ నెమలి బాలకృష్ణ భావన, సాయి ప్రసన్న  స్థానిక సర్పంచ్ లావుడియా లక్ష్మీ జోగనాయక్, ఎంపీటీసీ ఆలూరు శ్రీనివాసరావు, పిఎసిఎస్ డైరెక్టర్ దుడపాక రాజేందర్ మాజీ సర్పంచ్ భూక్య దేవానాయక్  పంచాయతీ కార్యదర్శి డి శంకర్ రెవెన్యూ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love