వ్యాపార సాముదాయాలకు రాత్రి వేళ సమయం సడలింపు

నవతెలంగాణ – కంటేశ్వర్

రాబోయే రోజులలో మహా శివరాత్రి , గుడ్ ఫ్రైడే , రంజాన్ , ఉగాది , శ్రీ రామనవమి , మరియు హనుమాన్ జయంతి మొదలగు పండుగలను పురస్కరించుకొని  ప్రజల సౌలభ్యం కోరకు ఏప్రిల్ నెల చివరి వరకు కమిషనరేట్ పరిధిలోని గల వ్యాపార సముదాయాలకు రాత్రి 10:30 నుండి రాత్రి 12 గంటల వరకు మినహాయింపు ఇవ్వమనీ సిబ్బందికి  ఆదేశాలు జరిచేసినట్లు తెలిసింది. గత 15 రోజులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిక్కచ్చిగా వ్యవహరించారు. అయితే సడన్గ పోలీస్ శాఖ ద్వారా ఇలాంటి ఆదేశాలు జారీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో తరచూ అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు సోషల్ మీడియాతో పాటు రాజకీయ నాయకులలో అలాగే ప్రజలలో సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే గత పది రోజులుగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 గంటలకు అన్ని సముదాయాలును మూసి ఉంచాలని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు కానీ ఆదివారం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందని అలాగే ఇతర ప్రజాప్రతినిధుల నాయకుల ఒత్తిడిలు ఉన్నాయని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రశ్నార్థకంగా మిగిలింది.

Spread the love