రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నవతెలంగాణ – భీంగల్
భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుదర్శన్ నగర్ తండా వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు జాగిర్యాల్ గ్రామానికి చెందిన కొనపత్రి లింబాద్రి ( 53) గా గుర్తించినట్టు తెలిపారు. అతను ఆర్మూర్ మండలం పెర్కిట్ నుండి స్వగ్రామం జాగిర్యాల్ గ్రామానికి తన ద్విచక్ర వాహనం పై వస్తుండగా సుదర్శన్ నగర్ తండా వద్ద అదుపుతప్పి పడి చనిపోయారు. మృతుని కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Spread the love