హిందూపురంలో స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద నామినేషన్

నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ బరిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద నేడు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. పరిపూర్ణానంద ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్ లభిస్తుందని ఆశించారు. అయితే హిందూపురం నుంచి కూటమి అభ్యర్థిగా, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా టీఎన్ దీపిక పోటీ చేస్తుండడం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థిగా వి.నాగరాజు పోటీ చేస్తున్నారు.

Spread the love