అల్లం నారాయణకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌!

– అసత్యపు వార్తల కేసులో కోర్టు ఉత్తర్వులు
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మెన్‌ అల్లం నారాయణకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జరీ అయింది. అసత్యపు వార్తలు రాసిన కేసులో కొత్తగూడెం కోర్టు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో కొత్తగూడెం సింగరేణిలో మెడికల్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని కోట్ల రూపాయలు దండుకున్నట్టు నమస్తే తెలంగాణలో కథనాలు ప్రచురించారు. ఆ డబ్బును బ్యాంకుల్లో నిల్వ చేసుకున్నట్టుగా, మెడికల్‌ బోర్డు డైరెక్టర్లను మాయ చేసి జీకే సంపత్‌ కుమార్‌ అనే ఉద్యోగి తన బ్యాంకు అకౌంట్‌ నుంచి సింగరేణి మెడికల్‌ బోర్డు డైరెక్టర్‌ అకౌంట్లోకి రోజు లక్షలాది రూపాయలు పంపినట్టుగా కథనాలు ప్రచురించడంపై కొత్తగూడెంలో కేసు నమోదైంది. 2013 నుంచి 2023 వరకు కోర్టులో కేసు నడిచింది.
ఈ క్రమంలో కేసు విషయంలో రెండేండ్లు కోర్టుకు హాజరు కానందున అప్పటి నమస్తే తెలంగాణ ఎడిటర్‌ అల్లం నారాయణ, చైర్మెన్‌ లక్ష్మీరాజంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి అడిషనల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది.

Spread the love