ఎన్టీఆర్‌ తెలుగోడి ఆత్మగౌరవ ప్రతీక

– ఘనంగా శతజయంతి ఉత్సవం
– భారతరత్న ఇవ్వాలని నాయకుల డిమాండ్‌
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
తెలుగోడి ఆత్మగౌరవ ప్రతీక.. తెలుగు వాణికి వెలుగులనద్ధిన మహానీయుడు.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసిన మాజీ జిల్లా అధ్యక్షులు కటికం సత్తయ్యగౌడ్‌, సీనియర్‌ నాయకులు తుమ్మల మధుసూదన్‌రెడ్డి, నియోజక వర్గ కోఆర్డినేటర్‌ ఎల్వీ. యాదవ్‌లు కొనియాడారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పేదల పాలిట దేవుడని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, వారి రాజకీయ, సామాజిక చైతన్యానికి కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. రాబోయే రోజుల్లో తెలుగువారి అభ్యున్నతి కోసం, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలోకి చైతన్య వెలుగులను తీసుకువచ్చిన దివంగత నేత ఎన్టీఆర్‌కు వెంటనే భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కసిరెడ్డి శేఖర్‌రెడ్డి, ఆకునూరి సత్యనారాయణ, కూరెళ్ల విజరుకుమార్‌, గుండు వెంకటేశ్వర్లు, బక్కతోళ్ల ఇస్తారి, పాలడుగు నాగరాజు, వనమా మనోహర్‌, ఎంకేఐ సిద్ధిక్‌, మహేశ్వరం గోపాల్‌, కంచనపల్లి క్రాంతికుమార్‌, జంపాల చంద్రశేఖర్‌, వీర్ల పరమేష్‌, అండెం తిరుపతయ్య, గుత్తా శంకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ: ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు పట్టణ పార్టీ కన్వీనర్‌ వడ్డెబోయిన శ్రీనివాస్‌ అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహంకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పి చైర్మన్‌ సిడి రవికుమార్‌ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్‌ ప్రవేశ పెట్టిన ప్రజా హిత కార్యమాలే ఈరోజు దేశంలో వేరే పార్టీలు, నాయకులు మేనిపెస్టోలు ప్రభుత్వలు అమలు చేస్తున్నాయని చెప్పారు. రాబోయే రోజులో తెలుగుదేశం పార్టీ ప్రజలసమస్యల పరిష్కారం కోసం ముందు ఉండి పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు నసీరోద్దీన్‌ బాబా, మండల కన్వీనర్‌ చిలకల వెంకన్న, రాష్ట్ర దళిత అధికార ప్రతినిధి నూక పంగు కాశయ్య, గంధం శ్రీనివాస్‌, మచ్చా సైదులు, రావిరాల నాగేందర్‌, నుసుమ్‌ నగేష్‌, నాయకులు ఏచూరి అనంత రాములు పోట్ల శంకర్‌ రావు, పగిడే పాటి రాంరెడ్డి, వరలక్ష్మి జి, రమేష్‌ నాయక్‌, లింగనాయక్‌, నవీన్‌ శోభన్‌ పాల్గొన్నారు.
నాగార్జునసాగర్‌ : నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్‌ కాలనీ కమ్మ సంఘం ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రాంబాబు ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను కులమతాలకు, పార్టీలకు అతీతంగా నిర్వహించారు. ఈ కార్యమానికి స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ వైస్‌ చైర్మెన్‌ రఘువీర్‌, బషీర్‌, శాఖమూరి నాగవర్ధన్‌, ప్రసాద్‌, కాకతీయ భవన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love