ఇంగ్లాండ్‌కు యశస్వి జైస్వాల్‌

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌
ముంబయి : యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌కు జాతీయ సెలక్టర్ల నుంచి పిలుపు అందింది. దేశవాళీ సర్క్యూట్‌లో రెడ్‌బాల్‌, వైట్‌ బాల్‌ ఫార్మాట్లలో ద్వి శతకాలతో దుమ్మురేపిన జైస్వాల్‌.. తాజాగా ఐపీఎల్‌లోనూ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో కదం తొక్కాడు. భీకర ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్‌ను ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జట్టుకు స్టాండ్‌ బై ఆటగాడిగా ఎంపిక చేశారు. రుతురాజ్‌ గైక్వాడ్‌ వివాహం నేపథ్యంలో ఇంగ్లాండ్‌కు వెళ్లటం లేదు. దీంతో రుతురాజ్‌ స్థానంలో జైస్వాల్‌ను ఎంచుకున్నారు. రెండో విడతగా లండన్‌కు వెళ్లనున్న క్రికెటర్ల బృందంతో పాటు జైస్వాల్‌ ఇంగ్లాండ్‌కు బయల్దేరనున్నాడు. ఐపీఎల్‌16లో యశస్వి జైస్వాల్‌ 48.08 సగటుతో 625 పరుగులు చేశాడు. అందులో ముంబయిపై 62 బంతుల్లో 124 పరుగుల శతకం సైతం ఉంది.

Spread the love