కౌటిల్య రాజదండకు ప్రజాస్వామ్యం దండా? సెంగోల్‌ సెంగోల్‌!


నేను ఒంగోల్‌ను అడుగుతున్నా చెప్పు!
నిన్ను చేతబుచ్చుకున్న మోడీశ్వరుడు
నందీశ్వరుడు కాడు గదా చెప్పు?

సెంగోల్‌ సెంగోల్‌!
నేను ఒంగోల్‌ను ఆందోళన చెందుతున్నా చెప్పు!
ఇది లౌకిక హేతువాదాలపై
ఆధ్యాత్మిక హింస కాదని చెప్పు?

సెంగోల్‌ సెంగోల్‌!
నేను ఒంగోల్‌ ను ప్రశ్నిస్తున్నా చెప్పు!
ఇది ప్రజాస్వామ్యంపై
రాజరికం ప్రతిష్ట కాదని చెప్పు?

సెంగోల్‌ సెంగోల్‌!
నేను ఒంగోల్‌ను నిలేస్తున్నా చెప్పు!
ఇది ద్రావిడీశ్వరునిపై
ఉత్తరాది ఆర్యీశ్వరుని ఆధిక్యత కాదని చెప్పు!

సెంగోల్‌ సెంగోల్‌!
నువ్వు దక్షిణాదివైనా
కౌటిల్య రాజదండకు అలంకృతవయ్యావు
ఒంగోల్‌ నిన్ను ఎప్పుడో నిరాకరించింది సెంగోల్‌!

సెంగోల్‌ సెంగోల్‌!
లంకేశ్వరిని కాటేసిన గుర్తులకు
హిజాబులను నిషేధించిన గాయాలకు
కన్నడనాడు కసి తీర్చుకుంది
కిండబడ్డా మీదేనన్నట్టు పరివారం
నిను వూతమందుకుంది!

సెంగోల్‌ సెంగోల్‌!
మఠంలోనో గుళ్ళోనో
మ్యూజియంలోనో వుంటే వుండు
కానీ, ప్రజాస్వామ్య క్షేత్రంలో నీకు తావు లేదు
నేను ఒంగోల్‌ను చెబుతున్నా!
రాకు సెంగోల్‌! వెళ్లు సెంగోల్‌!

– కృపాకర్‌ మాదిగ

Spread the love